Chandrababu Naidu Praja galam Public Meeting : మే 13న వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కూలదోసి తాడేపల్లి ప్యాలెస్‌ని బద్దలు కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వివేకా హత్య కేసులో నిందితులని పక్కనే పెట్టుకుని మరెవరిపైనో నెపం నెట్టేందుకు జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న నాటకాలు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఉన్నాయని ఎద్ధేవా చేశారు. దళితులకు సామాజిక న్యాయానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్న చంద్రబాబు ఎస్సీ వర్గీరకరణ ద్వారా మాదిగల అభ్యున్నతికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రౌడీయిజంతో సీమని నాశనం చేశారు : ప్రజాగళం ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించారు. తొలుత రాప్తాడులో నిర్వహించిన సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రస్తుత ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైనవని అన్నారు. వైఎస్సార్సీపీ విధ్వంస పాలనలో నాశనమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ జట్టు కట్టాయని తెలిపారు. ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశారన్న చంద్రబాబు అందులో ప్రతి ఒక్కరూ బాధితులేనని చెప్పారు. రాయలసీమను రత్నాలసీమగా మార్చేందుకు తెలుగుదేశం కృషి చేస్తే జగన్ తన మార్క్ రౌడీయిజంతో సీమని నాశనం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: రాప్తాడులో చంద్రబాబు - CHANDRABABU PRAJAGALAM
27 పథకాలను ఆపేశారు : తర్వాత శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రంలో నిర్వహించిన సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ ఐదేళ్లుగా ఎస్సీలను దగా చేశారని విమర్శించారు. ఎస్సీల అభివృద్ధి కోసం తాము తెచ్చిన 27 పథకాలను ఆపేశారన్న చంద్రబాబు సబ్‌ప్లాన్ నిధులను సైతం పక్కదారి పట్టించారని అన్నారు. ప్రొద్దుటూరు మేము సైతం సిద్ధం సభలో వివేకా హత్యపై జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. తాను ప్రజల గుండెల్లో ఉన్నానంటూ జగన్ చెప్పిన మాటలను బాబు ఎద్దేవా చేశారు. మే 13 కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్న చంద్రబాబు ఆ రోజు జగన్‌ని శాశ్వతంగా ఇంటికి సాగనంపేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేల పింఛన్: చంద్రబాబు - Chandrababu Tour in Kuppam
పరిశ్రమలు తరిమికొట్టడం జగన్ బ్రాండ్ : తర్వాత కదిరిలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షో పాల్గొన్న చంద్రబాబు రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే తేల్చాలని అన్నారు. రాయలసీమ కోసం జగన్ చేసిందేమీ లేదని గుర్తు చేశారు. ఐదేళ్లలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని, రాయలసీమలో 142 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉంటే రద్దు చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో సీమలో రూ.12వేల కోట్లు ఖర్చు చేశామని, వర్షపు నీటి భూగర్భ జలాలుగా మార్చామని అన్నారు. 10 లక్షల పంట కుంటలు తవ్వామని తెలిపారు. చెక్ డ్యామ్‌లు కట్టామని, బిందు సేద్యానికి 90శాతం రాయితీ ఇచ్చాం గుర్తు చేశారు. కియా వంటి పరిశ్రమలు తేవడం టీడీపీ బ్రాండ్ పరిశ్రమలు తరిమికొట్టడం జగన్ బ్రాండ్ అని విమర్శించారు.
ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు - ప్రచారానికి సిద్ధమైన జగన్, చంద్రబాబు - Political Heat in AP