ETV Bharat / politics

బీజేపీ ఎంపీ అభ్యర్థిని మాధవీ లతపై కేసు నమోదు - కారణం ఏంటంటే? - Police Case On BJP Madhavi Latha - POLICE CASE ON BJP MADHAVI LATHA

Police Case On BJP MP Candidate Madhavi Latha : హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని మాధవీ లతపై స్థానిక బేగం బజార్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు అయింది. ముస్లింల మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపిస్తూ షేక్ ఇమ్రాన్​ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.

Police Case On BJP MP Candidate Madhavi Latha

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 10:23 PM IST

Police Case On BJP MP Candidate Madhavi Latha : హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని మాధవీ లతపై స్థానిక బేగంబజార్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు అయింది. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బేగంబజార్ ఇన్​​స్పెక్టర్​ విజయ్ కుమార్ తెలిపారు.

మాధవీ లతను హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించినప్పటి నుంచి ఓ వర్గానికి (ముస్లిం కమ్యూనిటీ) వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు షేక్ ఇమ్రాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 17న రాత్రి శ్రీ రామ నవమి శోభాయాత్ర సందర్భంగా బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దంబర్ బజార్ వద్ద ఓ మసీదుపై బాణం వదులుతున్నట్లు వ్యవహరించి ముస్లింల మనోభావాలను దెబ్బ తీసినట్లు పోలీసులకు తెలిపారు. ఈ నెల 20న తమకు ఫిర్యాదు అందిందని, మాధవీ లతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్​స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.