ETV Bharat / politics

'జగన్ అతి పెద్ద లిక్కర్ సిండికేట్' - నూతన మద్యం విధానంపై సీఎంతో మంత్రుల సమావేశం - CM Review on New Liquor Policy

Cabinet Sub Sommittee Meeting on New Liquor Policy: రాష్ట్రంలో నూతన మద్యం విధానంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ విధానంపై మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎంకు వివరించారు. ఈ క్రమంలో వైఎస్సార్​సీపీ పాలనలో జగన్ అతి పెద్ద లిక్కర్ సిండికేట్ అని మంత్రులు మనోహర్ ఆరోపించారు. జే-బ్రాండ్స్ తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని దుయ్యబట్టారు.

cm_review_on_new_liquor_policy
cm_review_on_new_liquor_policy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 5:52 PM IST

Cabinet Sub Sommittee Meeting on New Liquor Policy: నూతన మద్యం విధానంపై సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. కొత్త మద్యం విధానంపై తమ అభిప్రాయాన్ని మంత్రివర్గ ఉపసంఘం సీఎంకు వివరించింది. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న మద్యం విధానాలను కూడా ఎక్సైజ్​ శాఖ ఉన్నతాధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గురువారం నాడు క్యాబినెట్ సమావేశంలో కొత్త మద్యం విధానంపై చర్చించి నిర్ణయం తీసుకున్న అనంతరం రాష్ట్రంలో అమలు కోసం దాన్ని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

నూతన మద్యం విధానంపై మంత్రుల సమావేశం - పన్నులు సవరణతో పాటు లాటరీ ద్వారా దుకాణాలు (ETV Bharat)

ప్రజల జేబుల్లో డబ్బు లూటీ: గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను సర్వ నాశనం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అక్రమ మద్యం విధానం అమలు కోసం జగన్ ప్రభుత్వం సెబ్​ను పెట్టిందని, జే బ్రాండ్​లను ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మించారని విమర్శించారు. రేట్లు పెంచి మద్యం నియంత్రణ చేస్తామని చెప్పారు. కానీ ప్రజల జేబుల్లో డబ్బు లూటీ చేశారని ఆరోపించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన మద్యం విధానం కోసం వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేశామన్నారు.

లాటరీ ద్వారా దుకాణాలు: వైఎస్సార్​సీపీ ఐదేళ్ల పాలనలో అత్యంత పెద్ద లిక్కర్ సిండికేట్ జగన్ మాత్రమేనని ఆరోపించారు. బూమ్ బూమ్ లాంటి బ్రాండ్​లు ఇప్పటికే ఆగిపోయాయని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి కల్లు గీత కార్మికులకు 10 శాతం దుకాణాలు కేటాయించనున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్​లు దుకాణాలు లాటరీ ద్వారా కేటాయిస్తారని స్పష్టం చేసారు. మద్యంపై పన్నులను కూడా సవరిస్తామని పేర్కొన్నారు.

భక్తులకు నాణ్యమైన ఆహారం అందించపోతే కఠిన చర్యలు: టీటీడీ ఈవో శ్యామలరావు - TTD EO Syamala Rao on hotels

నియంత్రణ, డీ అడిక్షన్ సెంటర్​లు ఏర్పాటు: నూతన మద్యం విధానం కోసం క్షేత్ర స్థాయిలో చాలా అధ్యయనం చేశామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా మద్యం విధానం అనుసరించారని ఆయన ఆరోపించారు. పూటకో జీఓ జారీ చేసి ధరలు పెంచుకున్నారని విమర్శించారు. నాణ్యమైన మద్యంతోపాటు నియంత్రణ, డీ అడిక్షన్ సెంటర్​లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. పర్యాటక రంగం మిళితం చేసి, పెట్టుబడులు వచ్చేలా ఈ ఎక్సైజ్ విధానం ఉంటుందని తెలిపారు. తద్వారా కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా కల్పించేలా ఈ విధానం ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Minister Satyakumar Yadav: నాసిరకం మద్యంతో గత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగుల వివరాలు బట్టి ఈ అంశం స్పష్టం అవుతోందన్నారు. జే బ్రాండ్​ల కారణంగా చాలా మంది అనారోగ్యం పాలై మృతి చెందారని ఆరోపించారు. బెవరేజేస్ కార్పొరేషన్ భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి మరీ మద్యం విధానం అమలు చేశారని మండిపడ్డారు. జే బ్రాండ్​ల కారణంగా కాలేయ సంబధిత వ్యాధులు విపరీతంగా పెరిగాయన్నారు.

మద్యం మత్తులో మందుబాబుల వీరంగం - కత్తి దాడిలో ఒకరు మృతి, బస్సు స్టీరింగ్ తిప్పిన మరో తాగుబోతు - Drunk mans Tragedy in Anantapur

కళ్లముందే వేలాది మద్యం సీసాలు - ఆగలేకపోయిన మందుబాబులు - DRUNKARDS LOOTED LIQUOR

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.