ETV Bharat / politics

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS MLAs Meet CM Revanth Reddy : పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇవాళ, ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌ రావులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

Four BRS MLAs Meet Telangana CM
BRS MLAs Meet CM Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2024, 8:09 PM IST

Updated : Jan 23, 2024, 10:22 PM IST

BRS MLAs Meet CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇవాళ సీఎం నివాసం జూబ్లిహిల్స్‌లో కలిశారు. సీఎం దావోస్ పర్యటన(Davos Trip) ఇటీవలే ముగించుకుని రావడంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌ రావులు కలిసిన వారిలో ఉన్నారు.

వచ్చే నెల నుంచే ఉచిత విద్యుత్ హామీ అమలు : కోమటిరెడ్డి

బీఆర్ఎస్ శాసనసభ్యులు సీఎంను కలవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందులోనూ కొత్త ప్రభాకర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకోగా, ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిసి వెళ్లి, ముఖ్యమంత్రిని కలిశారు. దీంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తాము మర్యాద పూర్వకంగానే కలిసినట్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి వద్ద గన్‌మెన్ల అంశాన్ని కొత్త ప్రభాకర్‌ రెడ్డి(Kotta Prabhakar Reddy) ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ తన అధికార ఎక్స్ ఖాతాలో సైతం పంచుకుంది.

  • ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి గారు (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి గారు (దుబ్బాక) , గూడెం మహిపాల్ రెడ్డి గారు (పఠాన్ చెరు), మాణిక్ రావు గారు (జహీరాబాద్). pic.twitter.com/fn2X9gkczI

    — Telangana Congress (@INCTelangana) January 23, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సునీతా లక్ష్మారెడ్డి గతంలో హస్తం పార్టీ నుంచే కేసీఆర్ పార్టీలో చేరారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారా అన్న అనుమానాలకు తావులేకుండా ఆమె సమాధానమిచ్చారు. సీఎంతో నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై, ఎమ్మెల్యే భద్రతా, ప్రొటోకాల్​పై చర్చించినట్లు ఆమె వివరించారు. అదేవిధంగా మరో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సైతం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని, ప్రధాని మోదీని సీఎం ఎలా కలిశారో, తాను అలానే కలిసినట్లు స్పష్టం చేశారు. లోక్​సభ ఎన్నికల్లో మెదక్​లో గులాబీ జెండా ఎగురవేస్తామని అయన తెలిపారు.

Minister Komati Reddy Sensational Comments on BRS Party : మరోవైపు సోమవారం ఉదయం నల్గొండ జిల్లా పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, గులాబీ పార్టీ​పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వీటితో తాజా పరిణామం మరిన్ని అనుమానాలకు దారి తీసినట్లైంది. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. లోక్​సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని, మరో 30 మంది ఆ పార్టీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్​లో మిగలరని విమర్శించారు.

ఆరు గ్యారంటీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నాం : శ్రీధర్‌బాబు

నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు - టికెట్‌ త్యాగం చేసిన వారికే ప్రాధాన్యం

Last Updated : Jan 23, 2024, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.