ETV Bharat / politics

విభజన చట్ట హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ - Srinivas Goud on AP Bifurcation Act - SRINIVAS GOUD ON AP BIFURCATION ACT

BRS Leader Srinivas Goud on Telangana Bifurcation : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్నా పరిష్కారం కావాల్సిన సమస్యలు ఇంకా ఉన్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వాటిని పరిష్కరించేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తే బీఆర్​ఎస్​ పార్టీ నిలదీస్తుందని హెచ్చరించారు. పొరపాట్లు చేస్తే సరిచేసే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.

Srinivas Goud on Telangana Bifurcation
BRS Leader Srinivas Goud (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 1:12 PM IST

విభజన చట్ట హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (ETV Bharat)

BRS Leader Srinivas Goud on Telangana Bifurcation : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్​ అంశాలను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ కోరారు. కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలు పోరాడి తెలంగాణ సాధించుకున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు. పదేళ్లలోపే అన్ని అంశాలు పరిష్కారం కావాలని, కానీ అది జరగలేదని పేర్కొన్నారు. తొమ్మిదో షెడ్యూల్​లోని ఆర్టీసీ, ఎస్​ఎఫ్​సీ లాంటి 30 సంస్థల అంశాలు పరిష్కారం అవ్వాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంస్థలపై దృష్టి సారించి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచించారు.

Srinivas Goud on AP Bifurcation Issues : ఏపీ వితండ వాదనతో పరిష్కారం కాకుండా కాలయాపన చేసిందని శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంలో స్పష్టంగా ఉన్నా, కేంద్రం చెప్పినా ఏపీ వినలేదని అన్నారు. గడువు పూర్తయినందున హైదారాబాద్​లో ఏపీకి కేటాయించిన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. తిరుపతిలో రాష్ట్రానికి ఒక భవనం ఉండాలనే ప్రతిపాదనను ప్రస్తుత ప్రభుత్వం పరిశీలించాలని విజ్ఞాప్తి చేశారు. ఉద్యోగుల విభజన సహా అన్ని అంశాలను వివాదం లేకుండా పరిష్కరించాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలను వివరించారు. చట్టానికి వ్యతిరేకంగా కొన్ని ప్రతిపాదనలు వస్తే వాటిని తమ ప్రభుత్వంలో తిరస్కరించామని గుర్తు చేశారు. మిగిలినవి ఏవైనా ఉంటే చట్ట ప్రకారం పూర్తి చేయాలని కోరారు.

"కొంత మంది ప్రయోజనాల కోసం ఇబ్బందులు రాకూడదు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తే మేము ఊరుకోబోం. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తాం. పొరపాట్లు చేస్తే సరిచేసే ప్రయత్నం చేస్తాం. పార్టీ మారలేదని గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చెప్పాలి." - శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి

Srinivas Goud on BRS Development : బీఆర్ఎస్​ పదేళ్ల పాలన అభివృద్ధిపై బీఆర్ఎస్​ నేత మాజీ మంత్రి వివరించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు చాలా సమస్యలు ఉన్నవని పదేళ్లలో పరిష్కరించామని తెలిపారు. రాష్ట్రంలో ఏపీకి చెందిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్​ అంశాలను కూడా పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

పార్టీని విడిచిపెట్టి వెళ్లిన వారిని తిరిగి రానిచ్చేది లేదు - శ్రీనివాస్‌ గౌడ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.