ETV Bharat / politics

కేసీఆర్ పాలనలో 'ఇరిగేషన్' పెరిగితే - రేవంత్ పాలనలో 'ఇరిటేషన్' పెరిగింది: హరీశ్​ రావు - BRS CHARGESHEET RELEASE

ఏడాది కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్​షీట్ - ఏడాది పాలన-ఎడతెగని వంచన పేరిట టైటిల్​

TELANGANA BHAVAN IN HYDERABAD
SIDDIPET MLA HARISH RAO (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2024, 3:52 PM IST

Harish Rao Fire on Govt : పదేళ్లలో కేసీఆర్ పెంచిన తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాదిలోనే దిగజార్చిందని, ఎడతెగని వేదనతో తిరోగమన రాష్ట్రంగా మార్చారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతికూల విధానాలతో రాష్ట్రం నష్ట పోయిందని, మార్పు అంటూ ఏదో ఆశించిన ప్రజలు హతాశులయ్యాని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని, రాష్ట్ర అభివృద్ధి మసకబారిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి ఛార్జ్​షీట్ విడుదల చేసింది. ఏడాది పాలన - ఎడతెగని వంచన పేరిట రూపొందించిన ఈ ఛార్జ్​షీట్​ను మాజీమంత్రి హరీశ్ రావుతో పలువురు నేతలు కలిసి విడుదల చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజాస్వామ్య పాలన, భావ ప్రకటన స్వేచ్చ అన్నారని అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, అపహాస్యం పాలైందని హరీశ్​రావు ఆరోపించారు.

తిట్లు, కొట్లు, ఓట్లు, నోట్లు : పోలీసు కుటుంబాలను పోలీసులతో కొట్టించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని హరీశ్​ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పాలనను తిట్లు, కొట్లు, ఓట్లు, నోట్లుగా అభివర్ణించారు. ప్రజాదర్బార్​కు సీఎం ఒక్క రోజు ఐదు నిమిషాలు మాత్రమే వెళ్లారని, సచివాలయంలో సీఎం ఉండే ఆరో అంతస్తుకు ఎవరికీ అనుమతి లేదన్నారు. రేవంత్ రెడ్డి పాలన ప్రతికూల ఆలోచనలు, నిర్ణయాలతో ప్రారంభమైందని, ఆరు గ్యారంటీలకు చట్టబద్దత లేదని ఆక్షేపించారు.

రేవంత్ రెడ్డి అపరిపక్వత, అసమర్థత రాష్ట్రాన్ని దెబ్బతీశాయని హరీశ్​రావు ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ చెప్పిన మార్పు దేశం ముందు నవ్వుల పాలైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రోడ్డు ఎక్కని వర్గం అంటూ లేదన్న ఆయన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని, రాష్ట్ర అభివృద్ధి మసకబారిందని విమర్శించారు. చిత్తశుద్ది, స్థిరత్వం లేని పాలనగా పేర్కొన్నారు.

గాంధీభవన్ సూచనలే : ప్రశాంతతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో నేడు అశాంతి, అలజడి నెలకొన్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, నేరాలు పెరిగిపోయాయని ఆరోపించారు. చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమై గాంధీ భవన్ సూచనల ప్రకారం పనిచేస్తోందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల వైఫల్యంతో పెట్టుబడులు పెట్టేవారు కూడా వెనక్కు పోతున్నారని ఆవేదన చెందారు. రేవంత్ పాలనకు కేసీఆర్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్న ఆయన కూల్చిన ఇళ్లు తప్ప ఏడాదిలో కట్టిన ఒక్క ఇళ్లు కూడా లేదని ఆక్షేపించారు.

కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఏకైక పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, బస్సులు తగ్గించారని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4.5 లక్షల కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిలోనే రూ.లక్ష కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు సొంత ఆదాయం, ఆస్తులు పెంచుకుంటున్నారు తప్ప రాష్ట్ర ఆదాయం కాదని వ్యాఖ్యానించారు. 1.53 లక్షల ఎకరాల పంట ఘనత అని గొప్పగా చెప్పుకుంటున్నారు 2014 ముందు ఎందుకు పండలేదని మాజీమంత్రి ప్రశ్నించారు.

"కేసీఆర్ ఏం చేయకపోతేనే కోటి 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందా. ఏడాది కాలంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఒక్క కాలువ, ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించిందా? ఆయన ఏడాదిలో ఆరున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అన్నారు. అందులో 6500 ఎకరాలకు అయినా నీరిచ్చారా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్న ప్రారంభించిన మూడింటిలో ఒక్క పని అయినా కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిందా? ఏడాదిలో పాలమూరు-రంగారెడ్డిలో తట్టెడు మట్టి కూడా ఎత్తిని రేవంత్​ రెడ్డికి పాలమూరు బిడ్డ అని చెప్పుకునే అర్హత లేదు." - హరీశ్​రావు, బీఆర్​ఎస్​ నేత

రేవంత్​ దేవుళ్లను కూడా మోసం చేశారు : తాము సవాల్ చేస్తే ఆగస్టు 15 వరకు అందరికీ రుణమాఫీ అన్న సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా మోసం చేశారని హరీశ్ రావు మండిపడ్డారు. దేవుళ్లను మోసం చేసినందుకే భూకంపం వచ్చిందని కొందరు అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇవాళ్టికి కూడా 50 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ చెప్పినట్లే రైతుబంధుకు రాంరాం అయిందని, బోనస్​ను బోగస్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.

గురుకులాలకు గ్రహణం : నిరుద్యోగుల రెక్కల కష్టంతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి వారి రెక్కలు విరిచారని హరీశ్​రావు ఎద్దేవా చేశారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అని 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 6000 మాత్రమే భర్తీ చేశారని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్​లో కాంగ్రెస్ వాళ్లకు మాత్రమే జాబులు కనిపిస్తున్నాయని, గురుకులాలకు రేవంత్ పాలనలో గ్రహణం పట్టిందని అన్నారు. తన నేరపూరిత నిర్లక్ష్యంతో రేవంత్ రెడ్డి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారని ఆరోపించారు.

మూసీ సుందరీకరణ : తెలంగాణలో చికున్ గున్యా వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్త అని అమెరికా హెచ్చరించే పరిస్థితి తీసుకొచ్చారని హరీశ్ రావు అన్నారు. ఏడాది అయినా ఉద్యోగులకు పీఆర్సీ దిక్కే లేదని, కూలిన ఇళ్లకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరిట లంకె బిందెలు వెతుకుతున్నారని, అదో మూటలు వెనకేసుకునే పథకంగా అభివర్ణించారు. తన వైఫల్యాలను ప్రతిపక్షాల కుట్ర అని రేవంత్ రెడ్డి దృష్టి మరలుస్తున్నారని అజ్ఞానాన్ని బయటపెట్టుకొని ముఖ్యమంత్రి పదవిని నవ్వులపాలు చేస్తున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి తిట్లు చూస్తుంటే దుర్భాషా దురంధరుడుగా నామకరణం చేయవచ్చని ఆరోపించారు. ఏడాది కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజల్ని హతాషుల్ని చేసిందన్న హరీశ్ రావు, మార్పు మార్పు అంటే ఏదో ఆశించిన ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారని అన్నారు. పురోగమన రాష్ట్రాన్ని తిరోగమన రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ పెంచిన తెలంగాణ ప్రతిష్ఠను ఒక్క ఏడాదిలోనే దిగజార్చారని కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగిందని పేర్కొన్నారు. ఏడాది పాలన ఎడతెగని వేదనను మిగిల్చింది తప్ప ప్రజలకు మిగిలింది ఏమీ లేదని హరీశ్​రావు ధ్వజమెత్తారు.

'హైడ్రాపై విష ప్రచారంతో కేటీఆర్, హరీశ్​రావు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు' - Mynampally Slams On BRS Leaders

హామీలపై కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి - యువతకు హరీశ్​రావు పిలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.