ETV Bharat / politics

వరంగల్ ఎంపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు - రెండు రోజుల్లో ప్రకటించనున్న కేసీఆర్ - LOK sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

BRS Focus On Warangal MP Candidate 2024 : బీఆర్ఎస్ వరంగల్ లోక్‌సభ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ తరఫున ఎవరిని బరిలో దింపాలన్న విషయమై గులాబీ పార్టీ ఇంకా తేల్చుకోలేకపోతోంది. మాదిగ సామాజికవర్గానికి చెందిన స్థానిక నాయకుడిని బరిలో దింపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. నాలుగైదు పేర్లపై చర్చించి నిర్ణయాన్ని అధినేత కేసీఆర్‌కు అప్పగించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఒకటి, రెండు రోజుల్లో గులాబీ అధినేత నిర్ణయం ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

BRS Focus On Warangal MP Candidate 2024
BRS MP Candidate In Warangal
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 7:16 AM IST

వరంగల్ ఎంపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు - రెండు రోజుల్లో ప్రకటించనున్న కేసీఆర్

BRS Focus On Warangal MP Candidate 2024 : లోక్​సభ ఎన్నికల వాతావారణం రాష్ట్రంలో రోజురోజుకూ వేడెక్కుతోంది. ఇప్పటికే పార్టీలు సమావేశాల రూపంలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితికి లోక్‌సభ ఎన్నికలు అత్యంత సవాల్​గా మారాయి. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. మొదట పేరు ఖరారు చేసిన కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది.

అభ్యర్థితో సంబంధం లేకుండానే వరంగల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. సీనియర్ నేత హరీశ్ రావు సమావేశానికి హాజరై నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి విషయమై బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. లోక్‌సభ నియోజకవర్గానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కడియం శ్రీహరి పార్టీకి గుడ్ బై చెప్పినందున స్టేషన్ ఘన్ పూర్ సమన్వయకర్తగా జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వ్యవహరిస్తున్నారు.

పార్లమెంటు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమించిన బీఆర్​ఎస్​ - BRS Appointed Coordinators

BRS MP Candidate In Warangal 2024 : కడియం కావ్య తప్పుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే రాజయ్య పేరు తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనతో మాట్లాడినట్లు సమాచారం. రాజయ్య సైతం పోటీకి సుముఖంగానే ఉన్నారు. రాజయ్యతో పాటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న, జిల్లా పరిషత్ ఛైర్మన్ సుధీర్, జెడ్పీటీసీ శ్రీనివాస్, వైద్యుడు సుగుణాకర్ రాజు సహా మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఎవరైతే మెరుగైన అభ్యర్థిగా ఉంటారన్న విషయమై పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది.

వరంగల్ బరిలో మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి : లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నికల బరిలో దింపాలని బీఆర్ఎస్ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల కార్యచరణ, అభ్యర్థిత్వం విషయమై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు సోమవారం సమావేశమై చర్చించారు. ఆశావాహులకు సంబంధించి సమావేశంలో చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా కలసికట్టుగా పనిచేసి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని నిర్ణయించారు. కడియం శ్రీహరి ఉదంతం నేపథ్యంలో మరింత కసితో పనిచేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. అభ్యర్థి ఎవరన్న విషయాన్ని అధినేత కేసీఆర్ నిర్ణయానికే నేతలు వదిలిపెట్టారు. అభ్యర్థి ఎవరైనా కష్టపడి గెలిపించుకుంటామని తెలిపారు.

ప్రచారాలతో హెరెత్తిస్తున్న బీఆర్​ఎస్ - ఉగాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలు - Lok Sabha Elections 2024

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు - ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ - LOK SABHA ELECTION 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.