ETV Bharat / politics

రెండోరోజు కొనసాగిన బీజేపీ విజయ సంకల్పయాత్ర - కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లపై కమలం నేతల ఫైర్‌

BJP Vijaya Sanklpayatra Second Day : భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన విజయ సంకల్ప యాత్ర రెండో రోజూ కొనసాగింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు గత ప్రభుత్వ పదేళ్ల పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ, మరోవైపు కాంగ్రెస్‌ హామీల అమలేదంటూ ప్రశ్నిస్తున్నారు.

BJP Vijaya Sanklpayatra Second Day
BJP Vijaya Sanklpayatra Second Day
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 7:27 PM IST

రెండోరోజు కొనసాగిన బీజేపీ విజయ సంకల్పయాత్ర- కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లపై కమలం నేతల ఫైర్‌

BJP Vijaya Sanklpayatra Second Day : పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తాచాటేలా సమరశంఖం పూరించిన భారతీయ జనతా పార్టీ, 17 లోక్‌సభ నియోజకవర్గాలను చుట్టేసేలా విజయ సంకల్ప యాత్రలు కొనసాగిస్తోంది. కృష్ణమ్మ క్లస్టర్‌ రెండో రోజూ విజయ సంకల్పయాత్ర నారాయణపేటలో కొనసాగింది. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో చేనేత కార్మికుల ఇంటికి వెళ్లిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan reddy), వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

Kishan Reddy Comments BRS : అనంతరం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై(BRS) కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పోటీచేయాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను ఇంకెప్పుడు అమలు చేస్తారంటూ ప్రశ్నించారు. హామీల అమలుకు ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూరుస్తారో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ రెండూ ఒక్కటేనని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.

10 ఎంపీ సీట్లకు పైగా గెలవడమే లక్ష్యం - పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కమలదళం

Etela Rajender in Sankalpa Yatra : యాదాద్రిలో ఈటల ఆధ్వర్యంలో బీజేపీ విజయసంకల్ప యాత్ర కొనసాగింది. ప్రధాని మోదీ(PM MODI) నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తోందన్న ఈటల, రాష్ట్రం సమగ్రాభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ హామీలపై ప్రజలకు భ్రమలు తొలగుతున్నాయన్న ఆయన, అప్పు కోసం కేంద్రం చుట్టూ సీఎం రేవంత్‌రెడ్డి తిరుగుతున్నారని విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని ఈటల స్పష్టం చేశారు.

Bandi Sanjay fires on BRS : నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ సంకల్పయాత్ర కొనసాగింది. మోదీని మూడోసారి ప్రధానిగా చేయాలనే సంకల్పంతో విజయసంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ముందుకెళ్తున్నామని వివరించారు.

అమరుల త్యాగాలను గత ప్రభుత్వం విస్మరించిందని, అందుకే ప్రజలు తగిన బుద్ది చెప్పారని బండి సంజయ్‌ విమర్శించారు. నిర్మల్‌ జిల్లాలోని వెయి ఉరులమర్రి వద్ద స్మృతివనం నిర్మిస్తామన్నారు. ఈ నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం సహకరించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 114 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 5వేల 500ల కిలోమీటర్లను సంకల్ప యాత్రల ద్వారా కమలం నేతలు చుట్టేయనున్నారు.

"పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పోటీచేయాల్సిన అవసరం లేదు. బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో పోటీకి ఎలాంటి అజెండా లేదు. గులాబీ పార్టీకి ఒక్క సీటు రాకున్నా జనానికి వచ్చే నష్టం లేదు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను ఇంకెప్పుడు అమలు చేస్తారు. హామీల అమలుకు ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూరుస్తారో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలి". - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయం : బండి సంజయ్​

కాంగ్రెస్​లో చేరుతున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఈటల​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.