ETV Bharat / politics

లోక్‌సభ ఎన్నికల వేళ రసవత్తరంగా రాజకీయం - ఆపరేషన్ ఆకర్ష్​తో బీజేపీ బిజీబిజీ

BJP Operation Akarsh in Telangana 2024 : బీజేపీ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ సత్ఫలితాలనిస్తోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎంపీలతో పాటు బలమైన ముఖ్య నేతలను తమ గూటికి చేర్చుకోవడంలో కమలదళం విజయవంతమైంది. ఇప్పటికే నాగర్‌ కర్నూల్‌, జహీరాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీలను పార్టీలో చేర్చుకున్న బీజేపీ, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

BJP Focus on MP Elections
BJP Operation Akarsh in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 7:57 AM IST

లోక్‌సభ ఎన్నికల వేళ రసవత్తరంగా మారిన చేరికల రాజకీయం - బలమైన అభ్యర్థులపై దృష్టి సారించిన బీజేపీ

BJP Operation Akarsh in Telangana 2024 : రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం పదైనా గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అధిష్ఠానం సైతం పది సీట్లతో పాటు, 35 శాతం ఓటు బ్యాంకును రాష్ట్ర నాయకత్వానికి లక్ష్యంగా పెట్టింది. అన్ని పార్టీల కంటే ముందుగానే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల కంటే ముందుగానే 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మోదీ ఛరీష్మాతో పది సీట్లు సునాయసంగా కైవసం చేసుకోవచ్చని భావించిన కమలదళానికి, బలమైన అభ్యర్థుల లేమి తలనొప్పిగా మారింది. దీంతో అధికారం కోల్పోయిన బీఆర్​ఎస్(BRS)​ నేతలపై బీజేపీ కన్నుపడింది.

బీఆర్​ఎస్​లోని బలమైన అభ్యర్ధులను పార్టీలోకి చేర్చుకోవాలని భావించింది. పార్టీలో బలమైన అభ్యర్థులు లేని నాగర్‌ కర్నూల్‌, జహీరాబాద్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపింది. బీజేపీ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ విజయవంతమైంది. బీఆర్​ఎస్​ నాగర్‌ కర్నూల్‌ సిట్టింగ్‌ ఎంపీ రాములు, జహీరాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌ను కాషాయగూటికి చేర్చుకుని తొలి జాబితాలోనే అభ్యర్థిత్వం ఖరారు చేసి పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

BJP Focus on Lok Sabha Polls 2024 : తాజాగా మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ (Ex MP Seetharam Naik), మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌లను కాషాయగూటికి తీసుకొచ్చేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలు ఈ ఇద్దరితో టచ్‌లోకి వెళ్లి సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి అసంతృప్తితో ఉన్న సీతారాం నాయక్ తాజాగా మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్(KCR) మాత్రం ఆ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత పేరునే ఖరారు చేశారు. పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదనే అసంతృప్తిలో ఉన్న సీతారాం నాయక్ నివాసానికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.

కిషన్‌ రెడ్డి(BJP Telangana Chief Kishan Reddy) ఆహ్వానంపై సీతారాం నాయక్‌ సానుకూలంగా స్పందించిన‌ట్లుగా తెలుస్తోంది. సీతారాం నాయక్‌ బీజేపీలో చేరితే మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన్ను బరిలో దింపనుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డ జలగం వెంకట్రావ్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి కొత్తగూడెంలో పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్​ఎస్​కు దూరంగా ఉన్న జలగం వెంకట్రావు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌తో భేటీ అయినట్లు సమాచారం. బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వెంకట్రావుకు ఖమ్మం టికెట్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వరంగల్‌లో బలమైన అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషిస్తోంది.

Telangana BJP Focus on MP Candidates 2024 : వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌(Aroori Ramesh)బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం పెద్దెత్తున నడిచింది. ఆరూరి రమేష్‌ రాకను స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆరూరి చేరిక నిలిచిపోయినట్లు తెలుస్తోంది. నల్గొండ, వరంగల్‌ అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటించే అవకాశం లేదని పార్టీలో ప్రచారం నడుస్తోంది. ఈ రెండు స్థానాల్లో చివరి క్షణం వరకు బలమైన నేతల కోసం వేచి చూడాలని బీజేపీ భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో చేరికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బీజేపీలో బలమైన నేతలు లేని నియోజకవర్గాలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను పార్టీలో చేర్చుకొని టికెట్‌ కేటాయించి, గెలుపు వ్యూహాలకు పదును పెడుతోంది.

బీఆర్ఎస్​కు పార్లమెంట్ ఎన్నికల గండం- పోటీకి అభ్యర్థులు విముఖత

అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే - బిజీబిజీగా గడపనున్న కేంద్రమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.