ETV Bharat / politics

అధికారం లేక కేసీఆర్‌ కుటుంబం బతకలేకపోతోంది: బండి సంజయ్ - BJP MP Bandi Sanjay Fires on KCR - BJP MP BANDI SANJAY FIRES ON KCR

BJP MP Bandi Sanjay Fires on KCR : అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు పొలంబాట పట్టలేదని, బీఆర్​ఎస్​ పాలనలోనే రైతులకు బేడీలు వేశారని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌ ఆరోపించారు. అధికారం లేక కేసీఆర్‌ కుటుంబం బతకలేకపోతోందన్న బండి, గులాబీ పార్టీ తరహాలోనే కాంగ్రెస్‌ పాలన ఉందన్నారు. రైతుబంధు ఇచ్చి రైతులకు ఇవ్వాల్సిన పథకాలు మెుత్తం ఎత్తేశారని సంజయ్​ వ్యాఖ్యానించారు.

Bandi Sanjay on Congress Schemes
Bandi Sanjay Comments on BRS
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 4:30 PM IST

BJP MP Bandi Sanjay Fires on KCR : రాష్ట్రంలో అధికారం లేక కేసీఆర్​ కుటుంబం బతకలేకపోతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్​ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు పొలంబాట(KCR Polam Bata) పట్టలేదని, నాడు బీఆర్ఎస్​ పాలనలోనే రైతులకు బేడీలు వేశారని సంజయ్​ వ్యాఖ్యానించారు. గతంలో వర్షాలకు రైతులు నష్టపోతే రూ.10 వేలు ఇస్తానన్న కేసీఆర్‌ ఎందుకు ఇవ్వలేదని, కనీసం ఒక్క రైతు కుటుంబాన్ని అయినా ఆదుకున్నారా అని ప్రశ్నించారు.

"మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎండిపోయిన పంటలను సందర్శించే కార్యక్రమం చేయటం చాలా సంతోషం. దానిని మేము వ్యతిరేకించటం లేదు. ఇప్పటికైనా ఆయనకు బుద్ధి వచ్చి, ఎండిపోయిన పంటలు గుర్తొచ్చాయి. ఆయన ప్రభుత్వ హయాంలో కూడా ఇబ్బంది పడ్డ రైతులు గుర్తొచ్చారు. కానీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలి. మీ పదేళ్ల కాలంలో 11 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆరోజు ఏ ఒక్క రైతు కుటుంబాన్నైనా మీరు పరామర్శించారా?"-బండి సంజయ్​, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

6 గ్యారంటీలు అమలు చేయకుండా - రాహుల్‌ గాంధీ తెలంగాణ ఎలా వస్తారు? : కిషన్‌ రెడ్డి - Kishan Reddy on Rahul Gandhi

కాంగ్రెస్​ పార్టీది ఆపన్న హస్తం కాదు - భస్మాసుర హస్తం : అదేవిధంగా సమగ్ర పంటల బీమా పథకం తీసుకొస్తానని కేసీఆర్​ ఎందుకు చేయలేదని బండి నిలదీశారు. గులాబీ పార్టీ తరహాలోనే కాంగ్రెస్‌ పాలన ఉందని, రైతుబంధు ఇచ్చి రైతులకు ఇవ్వాల్సిన పథకాలు మెుత్తం ఎత్తేశారని బండి సంజయ్‌ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఆ పార్టీది ఆపన్న హస్తం కాదని, భస్మాసుర హస్తమని బండి ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ‘పాంచ్ న్యాయ్’ పేరుతో మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు.

సిరిసిల్లలో నేతన్నకు తోడుగా దీక్ష : తెలంగాణను పదేళ్లపాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమన్నారు. 30 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఏనాడూ సాయమందించని కేసీఆర్, సిగ్గు లేకుండా రైతులపట్ల ప్రేమను ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS Party) రెండూ మోసపూరిత పార్టీలేనని, రైతులు, నేతన్నల దుస్థితికి రెండు పార్టీలే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని నేతన్నల దుస్థితికి నిరసనగా, వారిని ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్​తో ఈనెల 10న సిరిసిల్లో ‘దీక్ష’ చేయనున్నట్లు ప్రకటించారు.

Bandi Sanjay Comments on BRS, Congress : నయీం ఆస్తులపై విచారణ జరపడంతో పాటు ఆస్తులను దోచుకున్న కేసీఆర్ కుటుంబంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు అవగాహనతో వెళుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతిపై రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోదని, కాళేశ్వరం(Kaleshwaram Project) అక్రమాలపై కేసీఆర్ కుటుంబంపై కేసులు పెట్టదని ఆక్షేపించారు. అందుకు ప్రతిఫలంగా ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని అసెంబ్లీలో బీఆర్ఎస్ నిలదీయలేదన్నారు.

ఫోన్ ట్యాపింగ్ దోషులను వదిలేది లేదని హస్తం పదేపదే చెబుతుందని, మరి కేసీఆర్ కుటుంబమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఉందంటున్నారు కదా, మరి ఎందుకు వాళ్లను అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. రెండు పార్టీలు లోపల కుమ్కక్కై పైన డ్రామాలాడుతున్నయని ప్రజలు గమనించాలని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

అధికారం లేక కేసీఆర్‌ కుటుంబం బతకలేకపోతోంది: బండి సంజయ్

కర్షకుల పక్షాన కమలం పోరాటం - కరవు రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ - BJP Raithu Deeksha in Telangana

పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలన్న రేవంత్‌ రెడ్డి - ఇప్పుడెలా చేర్చుకుంటున్నారు : ఈటల - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.