Bandi Sanjay Election Campaign In Karimnagar : తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొడుతూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ప్రధాని మొదలు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోదీ పదేళ్ల సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలు బీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలు అంశాల గురించి క్షేత్ర స్థాయిలో ఎండగడుతున్నారు.
Bandi Sanjay Comments : దేశం ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండాలంటే కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీని గెలిపించాలని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లోని ప్రచార ర్యాలీలో పాల్గొన్న సంజయ్ ప్రజల ఓటు రామబాణంగా మారి దిల్లీకి వెళ్లాలని వ్యాఖ్యానించారు. కేంద్ర నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే బీజేపీని మరోమారు దీవించాలని ప్రజలను సంజయ్ కోరారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం : కరీంనగర్లో నిరంతరం ప్రజలు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడామని ఎంపీ బండి సంజయ్ అన్నారు. రైతులకు ఇబ్బందులు వస్తే అండగా నిలబడ్డామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్డగోలుగా డబ్బులు ఖర్చుపెట్టి, కరీంనగర్లో తనను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేయకున్నా, తామే చేసినట్లుగా చెప్పుకుంటున్నారని తెలిపారు.]
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో బుద్ది చెబుతారని విమర్శించారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను ఎలా నమ్మాలని రేవంత్ ప్రశ్నిస్తున్నారని ఆయన్ను సరిహద్దు వద్దకు తీసుకెళ్తే జవాన్లే చెబుతారని వ్యాఖ్యానించారు. సైనికుల త్యాగాలను అబాసుపాలు చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.
"కరీంనగర్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడాను. రైతులకు ఇబ్బందులు వస్తే అండగా నిలబడ్డాను. కేంద్ర నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టాను. కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలి. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీనే వస్తారు. దేశం ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకోకుండా ప్రజలు చూడాలి. ప్రజల ఓటు రామబాణంగా మారి దిల్లీకి వెళ్లాలి.సర్జికల్ స్ట్రైక్స్‌ను ఎలా నమ్మాలని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌ను సరిహద్దు వద్దకు తీసుకెళ్తే జవాన్లే చెబుతారు." _బండి సంజయ్, కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి
కేసీఆర్ కంటే కేటీఆరే ఎక్కువగా అధికారం చెలాయించారు : బండి సంజయ్ - BANDI SANJAY COMMENTS ON KTR
బండి సంజయ్ కరీంనగర్‌కు ఏమైనా నిధులు తెచ్చారా? : కేసీఆర్ - KCR bus trip in Karimnagar