ETV Bharat / politics

పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా? : భట్టి విక్రమార్క - Bhatti Vikramarka Fires on BRS - BHATTI VIKRAMARKA FIRES ON BRS

Bhatti Vikramarka Comments on KCR : సూర్యాపేటలో బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. గులాబీ నేతలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతుంటే కేసీఆర్‌ తట్టుకోలేపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాటల్లో కొంచమైనా వాస్తవాలు లేవన్నారు. పదేళ్ల పాలనలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పులపాలు చేశారని భట్టి దుయ్యబట్టారు.

Deputy CM Bhatti Vikramarka
Bhatti Vikramarka Fires on BRS
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 5:07 PM IST

Updated : Apr 1, 2024, 6:05 PM IST

Bhatti Vikramarka Comments on KCR : బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్‌ తాను కట్టిన ఇల్లును తానే తగలబెట్టి పోయారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఏడు లక్షల కోట్లకు పైగా అప్పులతో రాష్ట్రప్రజలపై రుణభారం మోపారని భట్టి ఆక్షేపించారు. సూర్యాపేటలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన భట్టి, బీఆర్​ఎస్​ నేతలు(BRS Leaders) భారీగా కాంగ్రెస్​లో చేరుతుంటే కేసీఆర్​ తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.​ నిన్న ఆయన మాటల్లో కొంచమైనా వాస్తవాలు లేవన్నారు.

పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారుతారా? అని ప్రశ్నించారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించారని భట్టి మండిపడ్డారు. మైక్‌ సమస్య వస్తే, దానికి కూడా కరెంట్‌ కోతలు అంటూ అబద్ధం మాట్లాడారని ఆక్షేపించారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పులపాలు చేశారన్న డిప్యూటీ సీఎం, పదేళ్ల పాలనలో కేసీఆర్‌ ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కరెంటు కోత, తాగునీటి కొరత ఉండొద్దు - అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశం - CM REVANTH on Water scarcity

విద్యుత్​ సరఫరా లేకుంటే వినియోగం ఎలా జరిగింది? : బొగ్గు లభించే ప్రాంతానికి 350 కి.మీ. దూరంలో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మించారని, అంత దూరంగా ఉండటం వల్ల థర్మల్‌ ప్లాంటుకు బొగ్గు సరఫరా కోసం భారీగా ఖర్చువుతోందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. పర్యావరణ అనుమతులు పొందటంలో ఆలస్యం వల్లే, నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని తెలిపారు. రాష్ట్రానికి 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ఇవ్వాలని విభజన చట్టంలోనే(Law of Partition) ఉందన్న భట్టి విక్రమార్క, విభజన చట్టం ప్రకారమే తెలంగాణకి ఎన్టీపీసీ మంజూరయ్యిందని వివరించారు.

సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్‌ నిర్మించాల్సి ఉంది. కానీ, కమీషన్ల కోసం సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భద్రాద్రి పవన్‌ ప్లాంట్‌ చేపట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం జరుగుతోందన్న డిప్యూటీ సీఎం, సరఫరా లేకుంటే ఇంత వినియోగం ఎలా జరిగిందని ప్రశ్నించారు. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్​ స్థాయిలో వినియోగం నమోదైనట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవన్న భట్టివిక్రమార్క, వినియోగదారులపై భారం మోపకుండా వ్యవస్థను గాడినపెట్టే చర్యలు చేపట్టామని వివరించారు.

"అస్తవస్తమైన వ్యవస్థలన్నింటినీ దారులో పెట్టడానికి చేస్తున్న మా ప్రయత్నం బీఆర్​ఎస్​ వాళ్లకు బెంబేలెత్తిస్తోంది. కేసీఆర్​ నిన్నటి పర్యటన, తన పార్టీకి సంబంధించి కొంతమంది కార్యకర్తలను కాపాడుకోవటం కోసం చేస్తున్న ప్రక్రియలా అనిపిస్తుంది తప్ప, ఆయన మాటల్లో ఏమాత్రం వాస్తవాలు లేవు."-భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి

Deputy CM Bhatti Challenges to KCR : ఏప్రిల్‌, మే నెలలోనూ సరిపడా విద్యుత్‌ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్న భట్టి, దేశమంతా గ్రిడ్‌ అనుసంధానం 2013లోనే యూపీఏ ప్రభుత్వం చేసిందన్నారు. పదేళ్లలో పాలనలో కేసీఆర్‌ ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్​ చేశారు. అందరికీ రెండు పడకగదుల ఇళ్లు(Double Bedroom Houses) నిర్మించి ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రతి మండలంలో బాలబాలికలకు ఆంగ్ల మీడియం స్కూళ్లు, ప్రతి నియోజకవర్గంలో కేజీ టూ పీజీ విద్యాలయాలు నిర్మించారా అని నిలదీశారు.

దళితులకు మూడెకరాల భూమి పంపిణీ మాట ఏమైందని ఆక్షేపించారు. అలానే వర్షాకాలంలో అధికారంలో ఉన్నది ఎవరన్న భట్టి, వాననీటిని రిజర్వాయర్లలో నింపే పరిస్థితి లేకుండా చేసిందెవరన్నారు. ప్రపంచంలోనే అత్యద్భుతం అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్​ కుంగిపోయిందని విమర్శించిన ఆయన, అన్ని లెక్కలతో చర్చకు రావడానికి తాను సిద్ధమని కేసీఆర్​కు సవాల్‌ విసిరారు.

పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా? : భట్టి విక్రమార్క

కేసీఆర్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు - ఆయన మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమే : ఉత్తమ్​కుమార్​ రెడ్డి - Lok Sabha Elections 2024

'మల్కాజిగిరి' మాదంటే మాదంటూ తలపడుతున్న ప్రధాన పార్టీలు - ఓటర్లు పట్టం కట్టేదెవరికో? - Lok Sabha Elections 2024

Last Updated : Apr 1, 2024, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.