Central Government Offices in Amaravati : రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గతంలో తెలుగుదేశం హాయంలో 10 నుంచి 15 కేంద్ర సంస్థలకు, జాతీయ బ్యాంకులకు రాజధాని ప్రాంతంలో భూముల కేటాయించారు. తమకు కేటాయించిన స్థలం చూపించాలని సంస్థలు కోరినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో నాబార్డ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎల్ఐసీ, ఇండియన్ ఆయిల్, HPCL, గెయిల్ వంటి సంస్థలు కూడా అమరావతిలో కార్యాలయం ఏర్పాటుచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
డీయాక్టివేట్ అవుతున్న ఆధార్ కార్డులు - మీ సంగతేంటో చెక్ చేసుకోండి - Aadhar cards deactivated
కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు : రాజధాని అమరావతిలో భూములు తీసుకున్న వివిధ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగుదేశం హయాంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో వివిధ కేంద్ర సంస్థలకు భూములు కేటాయించారు. జగన్ ప్రభుత్వం కనీసం వాళ్లతో మాట్లాడిన పాపాన పోలేదు. దీంతో ఎలాంటి ముందడుగు పడలేదు. ఏ సంస్థా రాకపోవడంతో అమరావతి వెలవెలబోయింది. తిరిగి ఇప్పుడు చంద్రబాబు నేృతత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
సీఆర్డీఏ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు! : గతంలో కేటాయించిన భూముల విషయంలో వారి ప్రణాళికలు చెప్పాలని సీఆర్డీఏ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. గత ఐదేళ్ల కాలంలో తమను ఎవరూ సంప్రదించ లేదని కొన్ని కేంద్ర సంస్థల ప్రతినిధులు సీఆర్డీఏ అధికారులతో అన్నట్లు తెలిసింది. తమకు కేటాయించిన స్థలం చూపించాలని మరికొన్ని సంస్థలు కోరినట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో కేటాయించిన స్థలం చూపిస్తే తదుపరి నిర్ణయం తీసుకుంటామని కొన్ని సంస్థల ప్రతినిధుల చెప్పారని తెలిసింది.
అమరావతిలో కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న సంస్థలు : తెలుగుదేశం హయాంలో 10 నుంచి 15 కేంద్ర సంస్థలకు, జాతీయ బ్యాంకులకు రాజధాని ప్రాంతంలో భూముల కేటాయించారు. కాగ్, ఆర్బీఐ, సీబీఐ, ఎఫ్సీఐ, CPWD, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, నిఫ్ట్, NID, టూల్ డిజైన్ సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. నాబార్డ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎల్ఐసీ, ఇండియన్ ఆయిల్, HPCL, గెయిల్ వంటి సంస్థలు కూడా అమరావతిలో కార్యాలయం ఏర్పాటుచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
పన్నుల పెంపుతో ప్రజల్ని పీల్చిపిప్పి చేసిన జగన్- గుర్తు చేసుకుంటున్న బెజవాడ వాసులు
ఈ రాష్ట్రం నీ తాత జాగీరా జగన్- ధనదాహానికి అంతు లేదా?: లోకేశ్ - Nara Lokesh on YSRCP Offices