AP Cabinet Meeting Chaired by CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. వివిధ శాఖలు రూపొందించిన నూతన పాలసీలపై ప్రభుత్వ శాఖలు ఇచ్చిన కీలక ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించింది. రాష్ట్రంలో పునరుద్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వనరుల వినియోగం పెంచేలా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0పై చర్చించి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
20 లక్షల ఉద్యోగాలు కల్పన, పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసే విధంగా పారిశ్రామిక పాలసీ 4.0ని రూపొందించారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పైనా రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించారు. 2030 నాటికి ఇంటింటికీ ఓ పారిశ్రామిక వేత్త అనే అంశంతో నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్ని ప్రోత్సహించేలా కొత్త పాలసీపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపారు. మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్ నియంత్రణ, ధరల నియంత్రణ, ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీల నియామకం పైనా కేబినెట్ లో చర్చించారు.
పారిశ్రామికవేత్తలను ఊరించేలా ఇండస్ట్రియల్ పాలసీ- సీఎం చంద్రబాబు సమీక్ష
సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అయ్యింది. కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు హాజరయ్యారు.#ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/1IwQiqvhuj
— Telugu Desam Party (@JaiTDP) October 16, 2024
మున్సిపాలిటీల్లో కొత్త పోస్టుల భర్తీ: అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్సు ఏర్పాటుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంకా వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ అంశంపై చర్చించారు. రుణాల రీషెడ్యూల్‌లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపైనా మంతనాలు చేశారు. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చ సాగింది. ఆలయాలకు పాలకమండళ్ల నియామకంలో చట్ట సవరణకు ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకున్నారు.
పాలకమండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై చర్చించారు. ఆలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలకమండలి సభ్యుల నియామకంపై మంతనాలు జరిపారు. దీపావళి నుంచి ప్రభుత్వం ఇచ్చే ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకంపైనా చర్చించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. ముందుగా పెట్టుబడులు పెట్టినవారికి అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రతిపాదనలు చేశారు.
ఆ 15 మంది MLAలకు చంద్రబాబు వార్నింగ్! - ఉచిత ఇసుక సరఫరా, మద్యం టెండర్లలో జోక్యం
సంక్రాంతికి 'పల్లె' కళకళలాడాలి - చంద్రబాబు అనుభవం మాకు ఎంతో బలం: పవన్ కల్యాణ్