AP Assembly Budget Meetings : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఏడాదికి రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టగా, కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు 4 నెలలకు గానూ ఓటాన్ అకౌంట్‌ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టగా, అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరో 4 నెలలకు ఓటాన్ అకౌంట్ పెట్టింది. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఏడాదికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఏపీ బడ్జెట్
- రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్
- రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
- రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు
- మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు
- రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు
- ద్రవ్య లోటు రూ.68,743 కోట్లు
- జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
- జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం
వివిధ రంగాలు
- ఉన్నత విద్య - రూ.2,326 కోట్లు
- ఆరోగ్యరంగం - రూ.18,421 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి - రూ.16,739 కోట్లు
- పట్టణాభివృద్ధి - రూ.11,490 కోట్లు
- గృహ నిర్మాణం - రూ.4,012 కోట్లు
- జలవనరులు - రూ.16,705 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్యం - రూ.3,127 కోట్లు
- ఇంధనరంగం - రూ.8,207 కోట్లు
- రోడ్లు, భవనాలు - రూ.9,554 కోట్లు
- యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ – రూ.322 కోట్లు
- పోలీసు శాఖ – రూ.8,495 కోట్లు
- పర్యావరణం, అటవీశాఖ – రూ.687 కోట్లు
- ఎస్సీ సంక్షేమం – రూ.18,497 కోట్లు
- ఎస్టీ సంక్షేమం - రూ.7,557 కోట్లు
- బీసీ సంక్షేమం - రూ.39,007 కోట్లు
- మైనార్టీ సంక్షేమం - రూ.4,376 కోట్లు
- మహిళ, శిశుసంక్షేమం - రూ.4,285 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి శాఖ – రూ.1,215 కోట్లు
- పాఠశాల విద్యాశాఖ – రూ.29,909 కోట్లు
మండలిలో కొల్లు రవీంద్ర : అటు శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటామని ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. అసెంబ్లీలో జరిగిన అంశాలపై మీడియాతో బయట తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తామని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరవుతారని సమాచారం.