ETV Bharat / politics

రండి! 'అమ్మ'కు ఓటేద్దాం- 'అన్నపూర్ణ'ను గెలిపిద్దాం! - Vote for Amaravati - VOTE FOR AMARAVATI

Vote for Amaravati : గతమంతా త్యాగాల మయం. వర్తమానం వేధింపుల పర్వం. భవిష్యత్​ గందరగోళం.. ఇదీ నేటి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రం తలరాత మార్చే అవకాశం వచ్చింది. 'ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక' అన్నట్లు ఒక్క ఓటు భవిష్యత్​కు మలుపు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలన్నా, సుపరిపాలన అందాలన్నా చక్కని ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ఓటు ఏకైక ఆయుధం. ఈ నెల 12న మాతృదినోత్సవం పురస్కరించుకుని అమ్మలాంటి ఆంధ్రప్రదేశ్​పై ప్రత్యేక కథనం.

vote_for_amaravati
vote_for_amaravati (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 3:27 PM IST

Updated : May 11, 2024, 6:47 PM IST

Vote for Amaravati :

తల్లి రుణం తీర్చే తరుణమిది.

రాజధాని కల నెలవేర్చుకునే సమయమిది.

ఐదేళ్ల అలుపెరగని పోరుబాటలో అంతిమ ఘట్టమిది.

కోట్లాది ప్రజల భవిష్యత్​కు బాటలు వేసుకునే సందర్భమిది.

అంపశయ్యపైనున్న అమరావతికి పునర్జన్మనిచ్చే ప్రత్యక్ష ఎన్నికలివి.

రండి! అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్​ పునర్నిర్మాణానికి నడుం బిగించండి! 'నేను సైతం' అంటూ ఎన్నికల కదనరంగాన కదలి సాగండి! మాతృదినోత్సవం సాక్షిగా ఓటు హక్కు వినియోగించుకుని జన్మభూమి రుణం తీర్చుకోండి.

అమ్మ జన్మనిస్తుంది. అవని జీవితాన్నిస్తుంది. ఆకలి, తీర్చి అవసరాలు సమకూర్చే ఈ నేల కూడా కన్నతల్లే. మన సంస్కృతి, సంప్రదాయం, సంక్రాంతి పండుగ సైతం ప్రకృతితో పెనవేసుకున్నవే. భూమితో విడదీయలేని బంధం మనది. భూమిని వదులుకోవడం అంటే ప్రాణం విడిచినట్టుగా భావించే తెలుగు నేల మనది.

పోలవరానికి జగన్‌ పాలన శాపం - పెండింగ్‌లో కీలక పనులు

పదేళ్ల కిందట నూతన రాజధాని నిర్మాణానికి ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మూడు పంటలతో తలతూగే బంగారం లాంటి భూములను అప్పగించారు. కానీ, పాలకుల కక్ష పూరిత విధానాలు రాష్ట్ర ప్రజల పాలిట ఆశనిపాతంలా మారాయి. రాష్ట్రానికి ఆయువుపట్టు లాంటి రాజధాని నిర్మాణం పడకేసింది. బంగరు భూములు బీళ్లుగా మారిపోయాయి. కొడిగట్టిన దీపంలా అమరావతిలో నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఊహించని విపత్తులో రాజధాని రైతుల పోరాటం ఐదేళ్లుగా అలుపెరగకుండా సాగుతోంది.

రాజధానిని మారుస్తూ అవస్థలు పడ్డా కశ్మీరును చూసి నేర్చుకోండి.. సీఎం సారూ..

గత ఐదేళ్ల పాలన నడి సంద్రంలో దిక్సూచి లేని పడవ ప్రయాణాన్ని తలపించింది. ఎటు వైపు సాగుతున్నామో, ఏ తీరం చేరుతున్నామో తెలియని అయోమయ పరిస్థితిని కల్పించింది. ఓ వైపు అమరావతి విధ్వంసం, మరోవైపు మూడు రాజధానుల పేరిట కాలయాపన మొదటికే మోసం తెచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్ మనుగడ, అభివృద్ధిని 20ఏళ్లు వెనక్కి నెట్టింది. ఉద్యోగులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి. అభివృద్ధికి ప్రామాణికమైన పరిశ్రమలు కొన్ని మూతపడ్డాయి. వేధింపులు తాళలేక మరికొన్ని పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. కొత్తగా ఉద్యోగాల్లేక, ఉపాధి అవకాశాలు కనిపించక యువత మోసపోయి వలసపోయింది.

Prathidhwani: అమరావతి... అసలేం జరుగుతోంది?

"ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నర జాతి సమస్తం పర పీడన పలాయనత్వం" మానవ జాతి పరిణామక్రమంపై మహాకవి శ్రీశ్రీ అభిప్రాయమిది. మనదీ దాదాపు ఇదే పరిస్థితి. గతమంతా త్యాగాల మయం. వర్తమానం వేధింపుల పర్వం. భవిష్యత్​ గందరగోళం. ఎన్నికల వేళ ఏరులై పారుతున్న మద్యం ప్రవాహంలో మనమూ కొట్టుకుపోదామా? ఓటు కోసం నోటు ఆశిస్తూ భవిష్యత్​ను తాకట్టు పెడదామా? సాగు, తాగు నీటికి అల్లాడుతున్న పల్లెలు, పట్టణాల ఘోష వినిపించడం లేదా? మన భూములపై హక్కులు తాకట్టు పెడుతున్న చట్టాలు కనిపించడం లేదా? అభివృద్ధి కావాలో? అగాధంలోకి వెళ్లాలో నిర్ణయించుకోండి. ఓటు ఆయుధాన్ని ఉపయోగించి రాష్ట్ర తలరాతను నిర్దేశించండి.

అమరావతిలో భూముల అమ్మక ప్రకటన అంతరార్థం ఏంటి?

Last Updated : May 11, 2024, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.