ETV Bharat / politics

జగన్‌ ఐదేళ్ల పాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు: కూటమి నేతలు - NDA Leaders Fire on Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 4:33 PM IST

Alliance Leaders Allegations against YS Jagan: జగన్ ఐదేళ్ల పాలనే రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు అని కూటమి నేతలు ఆరోపించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన జగన్ మ్యాన్ మేడ్ విపత్తు అని కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. విపత్తును ఎదుర్కోవడంలో చంద్రబాబు రోల్‌ మోడల్‌ అని లక్షల కోట్లు దోచుకోవడంలో జగన్ రోల్ మోడల్ అని ఆరోపించారు.

nda_leaders_fire_on_jagan
nda_leaders_fire_on_jagan (ETV Bharat)

Alliance Leaders Allegations Against YS Jagan: వరదల కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలను అనుబంధం చేసి ఈ క్రాప్​ ద్వారా నమోదు చేస్తుంటే జగన్ అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి విమర్శించారు. చంద్రబాబు బాధ్యతాయుతంగా వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తుంటే జగన్ బాధితులతో వెకిలి నవ్వులు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో తనపై అనేక కేసులు పెట్టి వేధించినా ఎన్నడూ కక్ష సాధింపు చర్యలు చేయలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

జగన్​నే అతి పెద్ద విపత్తు: జగన్‌ ఐదేళ్ల పాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. వ్యవస్థలన్నీ నాశనం చేశారని మండిపడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. అనవసర విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారని నాయకుడు ఎలా ఉండాలో పవన్‌ కల్యాణ్‌ను చూసి నేర్చుకోండని నాదెండ్ల మనోహర్‌ హితవు పలికారు.

కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్‌ - ఐపీఎస్​లపై రెండు రోజుల్లో వేటు! - Kadambari Jethwani Case

Minister Satyakumar: రాష్ట్ర ప్రభుత్వంపై జగన్‌ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు కందుల దుర్గేష్‌, సత్యకుమార్ మండిపడ్డారు. బకాయిలు చెల్లించకుండానే ప్రభుత్వ ఖజానాను ఖాలీ చేసి వెళ్లిన జగన్‌ రైతులను దగా చేశారని విమర్శించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయేలేని జగన్‌ చుట్టుపుచూపుగా వరద బాధితుల్ని పరామర్శకు వెళ్లి బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.10 లక్షల కోట్లు గత వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అప్పు చేసిందని ఆరోపించారు. ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ మీద ముందుగానే అప్పు చేసిన ఘనత జగన్‌దేనని అన్నారు.

జగన్ వల్లే రాష్ట్రానికి వరద ముప్పు: సీఎం చంద్రబాబు అవిశ్రాంతంగా పనిచేసి విజయవాడ వరదల్లో ప్రాణనష్టం జరగకుండా చూశారని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. మంత్రులు, అన్ని శాఖల ఉద్యోగులు కష్టపడి పనిచేశారని అభినందించారు. రివర్స్‌ టెండర్‌ పేరిట జగన్‌ చేసిన నిర్వాకం వల్లే ఏలేరుకు వరదలొచ్చాయని సోమిరెడ్డి అన్నారు. క్యూసెక్కులు, టీఎంసీ, ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో అంటే కూడా జగన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. జగన్‌ పాలనలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖలు మూసేశారని అన్నారు. వరద బాధితులను పరామర్శించడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. వరద బాధితులు కష్టాల్లో ఉంటే జగన్ రోడ్ షోలు నిర్వహిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారని విమర్శించారు.

కొర్రీలు వద్దు - కనికరం చూపండి - బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులకు చంద్రబాబు ఆదేశాలు - Chandrababu Meeting With Bankers

వరద బాధితులకు ఆపన్న హస్తం - భాష్యం 4 కోట్లు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ 3 కోట్లు - HUGE DONATIONS TO AP CMRF

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.