ETV Bharat / politics

ఎమ్మెల్సీ ఉపఎన్నికలో అభ్యర్థుల ప్రచారజోరు - పట్టభద్రులు పట్టం కట్టేదెవరికి? - GRADUATE MLC BY POLL CAMPAIGN - GRADUATE MLC BY POLL CAMPAIGN

Graduate MLC By Poll in Telangana 2024 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహరచనలు చేస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని వర్గాలను అధికార పార్టీ మోసం చేసిందంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంటే గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాంగ్రెస్‌ ప్రచారాన్ని నిర్వహిస్తుంది. బీజేపీ సైతం విజయం సాధిస్తామంటూ ధీమాను వ్యక్తం చేస్తోంది.

Graduate MLC Elections Campaign 2024
MLC ByPoll Elections 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 7:16 AM IST

ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ప్రచారజోరు - పట్టభద్రులు పట్టం కట్టేదెవరికి? (ETV Bharat)

Telangana Graduate MLC By Poll in 2024 : ఉమ్మడి వరంగల్‌ నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ జోరుగా ప్రచారం చేస్తోంది. భద్రాచలం నియోజకవర్గంలో 90 శాతం ఓట్లు కాంగ్రెస్‌కే వస్తాయని ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోని స్థానిక నేతల మధ్య చోటు చేసుకున్న అంతర్గత విభేదాల నడుమే నాయకులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. భద్రాచలంలో బీజేపీ, బీఆర్ఎస్ ఉనికే లేదని విమర్శించారు.

Graduate MLC Elections Campaign 2024 : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓ బ్లాక్ మెయిలర్ , మోసగాడని మాజీమంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పేర్కొన్నారు. మల్లన్నను గెలిపిస్తే రేవంత్ రెడ్డిని నిలదీయలేడని అందుకే రాకేశ్‌ను గెలిపించాలని ములుగులో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ చెప్పిన మార్పు అంటే కరెంట్ కోతలు, ఐటీ కంపెనీల తరలింపేనా అని మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌, హనుమకొండలో జరిగిన పట్టభద్రుల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు పేరు చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు.

'కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేశారు. కాంగ్రెస్‌ చెప్పిన మార్పు అంటే కరెంట్ కోతలు, ఐటీ కంపెనీల తరలింపేనా? రాకేష్ రెడ్డిని గెలిపించాలి. నాలుగు వందల హామీలు కాంగ్రెస్ ఇచ్చింది. అవి నెరవేరాలంటే ప్రశ్నించే గొంతుకను రాకేష్ రెడ్డిని గెలిపించాలి.' - కేటీఆర్, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక - ఓట్లవేటలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీలు - GRADUATE MLC BYPOLL CAMPAIGN IN TS

దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే అన్ని ఎన్నికల్లోనూ కషాయదళం కదనం తొక్కాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు హైకోర్టు న్యాయవాదుల ఐకాస ప్రకటించింది.

'ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. రాష్ట్రంలో బీఆర్ఎస్​ ఖాళీ అయ్యింది. బీఆర్ఎస్, బీజేపీ ఐదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలకు ఓటు అడిగే అర్హత లేదు. పట్టభద్రులందరూ ఆలోచించి ఓటు వేయాలి. నేను గెలిస్తే యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తా' - తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ అభ్యర్థి

కాంగ్రెస్​ మార్పంటే కరెంటు కోతలు, ఐటీ కంపెనీల తరలింపు : కేటీఆర్​ - KTR Comments on CM Revanth Reddy

ఎమ్మెల్సీ ఉపఎన్నికపై కాంగ్రెస్ కేడర్‌ క్రియాశీలకంగా పనిచేయాలి : రేవంత్‌ - CM REVANTH ZOOM MEET on Election

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.