AICC Warning To Party Leaders : పార్టీలో అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలపై మీడియా ముందుకు వెళ్తున్న నాయకులపై ఏఐసీసీ సీరియస్ అయింది. పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇటీవల లోక్‌సభ అభ్యర్ధుల ప్రకటనపై ఇద్దరు సీనియర్ నాయకులు వ్యతిరేక స్వరం వినిపించడంపై ఆ పార్టీ నాయకత్వం స్పందించింది. ఇప్పటికే పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌తో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరి, మహేష్‌కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. మరొక్కసారి వ్యతిరేకంగా మాట్లాడొద్దని హెచ్చరించారు.
Congress Mahesh Kumar Goud To Party Leaders : మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు మీడియా సమావేశంలో పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మట్లాడడాన్ని కూడా రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరడం కార్యకర్తలు సహించడం లేదని ఆయన తెలిపారు. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందేనన్నారు. భిన్నాభిప్రాయాలు పార్టీలో అంతర్గతంగా తెలియజేయాలన్న ఆయన క్రమశిక్షణ ఉల్లంఘించే వారు పార్టీలో ఎంత సీనియర్ అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ నిర్ణయానుసారం నడవాలన్నారు.
లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ వ్యూహం - అత్యధిక స్థానాలే లక్ష్యంగా దిశానిర్దేశం
Congress Leader VH Fire on Cm Revanth : బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరడం (Congress Joinings) పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు ఇటీవల అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్(BRS)పీడ పోయిందన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు మళ్లీ ఎందుకు ఆ పార్టీ వాళ్లను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. తాజా రాజకీయ పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లోకి ఎందుకు చేర్చుకుంటున్నారు : వీహెచ్ - Congress Leader VH Fire on CM
BRS Leaders Joining in Congress : రేవంత్(CM Revanth Reddy) పార్టీని బలోపేతం చేశారన్న వీహెచ్, బీఆర్‌ఎస్ వాళ్లను పార్టీలో చేర్చుకోవడంతో కార్యకర్తలు బాధపడుతున్నారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న నాయకులను పక్కన పెట్టి, బయట నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలే పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.