చలన చిత్ర రంగానికి ఎనలేని సేవలందించిన రామోజీరావు - RAMOJI WITH CINE PERSONALITIES
RamojiRao with Cine Personalities : రామోజీరావు చలన చిత్ర రంగానికి ఎనలేని సేవలందించారు. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించిన సినీ చిత్ర సీమలో చెరగని ముద్రవేసుకున్నారు. ఈ బ్యానర్ ద్వారా పరిచయమైన నటులు గొప్ప తారలుగా ఎదిగి సినీరంగంలో అగ్రశ్రేణిలో ఉన్నారు. భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చిన రామోజీరావుకు సినీ ప్రముఖులు నివాలర్పించారు. రామోజీరావు అస్తమయం సినీ లోకానికి తీరనిలోటు. (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 8, 2024, 11:15 AM IST