Why Stock Markets are Increasing at a Record Level : దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో లాభాలు ముూటగట్టుకున్నాయి. ప్రధానంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ కంపెనీల్లో పెద్దఎత్తున షేర్లు కొనేశారు. దీంతో మన కంపెనీల విలువలు భారీగా పెరిగాయి. వరుసగా మూడు వారాలుగా దేశీయ కంపెనీల షేర్లు లబ్ది పొందుతున్నాయి. ముడిచమురు ధరలు పెరగడం, అంతర్జాతీయంగా నెలకొని ఉన్న యుద్ధ వాతావరణం మన మార్కెట్లకు కలిసి వస్తోంది.
రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్లు మరిన్ని లాభాలు సాధించే అవకాశముందన్న అంచనాలున్నాయి. బంగారం ధరలు కూడా జీవిత కాల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠస్థాయికి చేరడానికి తోడ్పడిన అంశాలు ఏంటి? ఈ వృద్ధి ఎంతకాలం కొనసాగుతుంది? రానున్న ఎన్నికల ఫలితాలు మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఇదే నేటి ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">