ETV Bharat / opinion

తెలంగాణ ప్రజల గల్ఫ్​ కష్టాలకు తెర ఎప్పుడు - ఎందుకు ఇంకా వలసలు కొనసాగుతున్నాయి? - TS People Difficulties in Gulf

Telangana People Difficulties in Gulf : దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. అయితే ఇలా ఎంతో మంది ప్రజలు గల్ఫ్​ దేశాలకు వెళ్లి అక్కడి జైళ్లలో మగ్గిపోతున్నారు. మరి అసలు తెలంగాణ ప్రజల గల్ఫ్​ కష్టాలకు తెర ఎప్పుడు?

Gulf Crisis of Telangana People End
When Will The Gulf Crisis of Telangana People End
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 10:03 AM IST

Updated : Feb 22, 2024, 10:21 AM IST

Telangana People Difficulties in Gulf : దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఓ హత్యకేసులో 18 ఏళ్లుగా వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వారికోసం చేసిన అనేక ప్రయత్నాల తర్వాత కనికరించిన దుబాయ్​ కోర్టు వారిని ఏడేళ్లు ముందే విడుదల చేసింది. దీంతో సిరిసిల్ల, రుద్రంగి, కొనరావుపేట మండలానికి చెందిన ఐదుగురు సుదీర్ఘ నిరీక్షణల తర్వాత దుబాయ్ నుంచి హైదరాబాద్‌ తిరిగి వచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

18 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భావోద్వేగ వాతావరణం నెలకొంది. అయితే వీరి కథ సుఖాంతమైంది. కానీ ఆ గల్ఫ్‌ జైళ్లలో మగ్గిపోతున్న మరెంతోమంది పరిస్థితేంటి? అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజల గల్ఫ్‌ కష్టాలకు తెర ఎప్పుడు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Telangana People Released From Dubai Jail : రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు కూలీలు కూలీ పనుల కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ నేపాల్​కు చెందిన వాచ్​మెన్​ బహదూర్​ సింగ్​ హత్య కేసులో నేరస్థులుగా మారారు. ఈ కేసులో 10 మంది ఆరోపణలు ఎదుర్కొగా, తెలంగాణకు చెందిన ఐదుగురు అందులో ఉన్నారు. దీంతో తొలుత పదేళ్ల జైలు శిక్ష విధించిన దుబాయ్​ కోర్టు, నేరం నిరూపణ కావడంతో ఆ శిక్షను 25 ఏళ్లకు పెంచింది.

ఈ విషయం ఈనాడు దినపత్రిక ద్వారా 2011లో కేటీఆర్​ దృష్టికి వెళ్లింది. దీంతో వారిని రప్పించేందుకు యత్నించారు. స్వయంగా నేపాల్​కు వెళ్లి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ఇచ్చి క్షమాభిక్ష రాయించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం మారడంతో నిబంధనలు కఠినతరం కావడంతో విడుదల జాప్యమైంది. బాధితులకు అక్కడి భాష తెలియకపోవడం, ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఇబ్బంది పడుతున్న కుటుంబ సభ్యులకు కేటీఆర్​ న్యాయ పోరాటం కోసం ఆర్థిక సహాయం అందించారు. మరోసారి బాధితుల అనారోగ్య కారణాలు చూపుతా మాజీ మంత్రి కేటీఆర్​ న్యాయ పోరాటం చేశారు. ఆఖరికి ఎన్నో ప్రయత్నాల అనంతరం కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడంతో కార్మికులు స్వదేశానికి రావడానికి మార్గం సుగమమైంది.

Last Updated : Feb 22, 2024, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.