Social Worker Agitation at Municipal Office in Palnadu District : పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద 18వ వార్డు సామాజిక కార్యకర్త బొగ్గరం మూర్తి ఆందోళన చేపట్టారు. నరసరావుపేట 19వ వార్డులోని ఎన్‌ఎంసీ పబ్లిక్ టాయిలెట్స్ని కబ్జా చేసిన వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల తీరుకు నిరసనగా కార్యాలయం ఎదుట మూర్తి బైఠాయించి శిరోముండనం చేయించుకున్నారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడేందుకు యత్నించినందుకు తనపై శుక్రవారం వెంకటరెడ్డి హత్యాయత్నం చేశాడని ఆరోపించారు. వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు తిరిగి అతన్ని వదిలిపెట్టడం దారుణమన్నారు. వెంకటరెడ్డిపై వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలి: బహుజన టీచర్ల సంఘం
బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని రోడ్డు ప్రక్కన 19వ వార్డు సచివాలయ భవనాన్ని ( బీసీ సామాజిక భవనం ) ఆధునికరీస్తున్నారు. దీని ఎదుట పట్టణ వైసీపీ నేత వెంకటరెడ్డికి ( మిలటరీ రెడ్డి) చెందిన వాణిజ్య భవన సముదాయం ఉంది. దీని పక్కన ప్రభుత్వ పోరంబోకు ఖాళీ స్థలాన్ని ఆక్రమించి ఆయన గతంలోనే మరుగుదొడ్డి నిర్మించారు. ప్రస్తుతం అది సచివాలయం కోసం ఏర్పాటు చేసిన దారికి అడ్డుగా మారింది. దీన్ని తొలగించాలని పురపాలక సంఘం, సచివాలయ సిబ్బంది ఆయనకు పలుమార్లు సూచించారు. అధికార పలుకుబడితో వారి చర్యలను అడ్డుకున్నారు. సామాజిక కార్యకర్త, 18వ వార్డు వైసీపీ నేత బొగ్గురం మూర్తిని స్థానికులు ఆశ్రయించారు. ఆయన ప్రోత్సాహంతో స్థానికులు జిల్లా స్పందన కార్యక్రమంలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.
అధికారుల ఆదేశాలతో గుత్తేదారు గురువారం ( ఫిబ్రవరి 8) మరుగుదొడ్డిని కూల్చే పనులు చేపట్టారు. వారికి మద్ధతుగా అక్కడికి వచ్చిన బొగ్గరం మూర్తిపై వెంకట రెడ్డి గొడవ పెట్టుకుని దాడికి పాల్పడ్డాడు. తన బైక్ నుంచి కత్తి తీసుకొని చంపుతానంటూ ఆవేశంగా దూసుకొచ్చారు. అక్కడున్న స్థానికులు అతన్ని నిలువరించారు. పోలీసులు వెంకట రెడ్డిని అదుపులోకి తీసుకుని 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అతని వద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని విడిచిపెట్టారు.
గుడివాడలో రోడ్డు కోసం మహిళల నిరసన - ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం
పురపాలక శాఖ విధులను అడ్డుకుని సిబ్బందిని భ్రయబ్రాంతులకు గురిచేసిన వైసీపీ నేతపై ఫిర్యాదు చేసేందుకు అధికారులు వెనకాడుతున్నారు. అతనిపై చర్య తీసుకుని కేసు నమోదు చేయాలని బాధితుడు మాత్రం పోలీసులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ సంఘటనపై విచారిస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. అయితే గురువారం రాత్రి వరకు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
"స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నా మీద హత్యాయత్నం చేసిన వెంకటరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయించి, రక్షణ కల్పించాలని కోరుతున్నాను. ప్రభుత్వం స్థలాన్ని కాపాడడానికి ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ అధికారులు నీళ్లు నములుతున్నారు. పోలీసులు, అధికారులు అతన్ని చూస్తే భయపడుతున్నారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి" - బొగ్గరం మూర్తి, సామాజిక కార్యకర్త, వైసీపీ నేత