ETV Bharat / opinion

మన విద్యార్థులు ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లే రోజులు పోవాలంటే ఏం చేయాలి? - PM Modi About Higher Education hub - PM MODI ABOUT HIGHER EDUCATION HUB

Pratidwani : ఏటా లక్షల మంది మన విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడం కాదు, ప్రపంచమే భారత్ వైపు చూడాలన్నారు ప్రధానమంత్రి మోదీ. ఆ దిశగా మనకున్న సానుకూలతలు ఏమిటి? ఉన్నత విద్య కోసం ఎందుకు లక్షలాదిమంది విద్యార్థులు అమెరికా, జర్మనీ వంటి దేశాలకు వెళుతున్నారు? ఇలాంటి మరిన్ని అంశాల గురించి నేటి ప్రతిధ్వని ద్వారా తెలుసుకుందాం.

PRATIDHWANI ON WHEN WILL INDIA BECOME HIGHER EDUCATION HUB
PRATIDHWANI ON WHEN WILL INDIA BECOME HIGHER EDUCATION HUB (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 16, 2024, 10:09 AM IST

Pratidwani : భారతదేశం గత వైభవ చరిత్ర, ఘనమైన భవిష్యత్ ఆకాంక్షలకు ప్రతి రూపంగా వినిపించే పదం 'విశ్వగురు'. దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇదే స్ఫూర్తిని ప్రముఖంగా ప్రస్తావించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. లక్షల మంది భారతీయ యువత ఉన్నత విద్య కోసం విదేశాల బాట పట్టడం కాదు వారికి ఇక్కడే మెరుగైన అవకాశాలు అందించడంతో పాటు విద్యావసరాల కోసం ప్రపంచాన్ని భారత్‌ వైపు చూసేలా చేయాలని పిలుపు నిచ్చారు. ప్రాచీన భారత మేధో కీర్తికి నిదర్శనంగా తిరిగి నిలబెట్టిన నలందా విశ్వవిద్యాలయం బాటలో ఉన్న విద్యను మెరుగుపరచాలన్నారు. మరి ప్రధానమంత్రి కోరుకుంటున్నట్లు మన విద్యార్థులు ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లే రోజులు పోవాలంటే ఏం చేయాలి? ఇదీ నేటి ప్రతిధ్వని అంశం.

చర్చలో పాల్గొంటున్న వారు యూజీసీ మాజీ సభ్యుడు, జేఎన్టీయూ మాజీ వీసీ ప్రొఫెసర్ డీఎన్‌ రెడ్డి. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ నుంచి వీసీ వరకు పలు హోదాల్లో సేవలందించారు. AICTE దక్షిణ మధ్య విభాగానికి ప్రాంతీయ ఛైర్మగా వ్యవహరించారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన విద్యావేత్తగా ఉన్నారు. మరొకరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) విశ్రాంత డైరెక్టర్ డా. వీఎస్‌ఆర్‌కే ప్రసాద్. ఈయన IIPE డైరెక్టర్‌తో పాటు దాదాపు 4 దశాబ్దాలుగా సాంకేతిక విద్యారంగంలో ఆచార్యునిగా, సంచాలకుడిగా పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సహా జాతీయ స్థాయి సంస్థల్లోనూ విదేశీ విద్యాసంస్థల్లోనూ సేవలందించిన ప్రముఖ విద్యావేత్త వీఎస్‌ఆర్‌కే ప్రసాద్.

సప్తసముద్రాలు దాటివెళ్తున్న యువత - విదేశీ విద్యకు ఉన్న అవకాశాలేంటి? - Youngsters Foreign Education

ప్రధాని కోరుకుంటున్న స్వప్నం సాకారమైతే విదేశాల బాట పట్టే విద్యార్థులు తగ్గడం, ఇక్కడికి వచ్చేవారి సంఖ్య పెరగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి. భారతదేశ ప్రాచీన విద్యారంగం కీర్తికి నలందా విశ్వవిద్యాలయాన్ని ప్రతిరూపంగా చెప్పారు ప్రధానిమోదీ. దాని గొప్పదనమేంటి? ఆ రోజుల్లో భారతీయ విద్యావ్యవస్థకు అంత పేరుండడానికి కారణమేంటి? ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన IIT, IIMలు సహా దేశీయ విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమిటి? వాటిని అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అవసరం? మీరు ఓయూ ఇన్‌ఛార్జ్ వీసీ, JNTU-Hవీసీ నుంచి యూజీసీ సభ్యులుగా, AICTEలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఆ అనుభవంతో చెప్పండి ప్రధానమంత్రి కోరుకుంటున్నట్లు విశ్వగురు గా భారత్ తిరిగి నిలబడాలంటే మన వర్సిటీలు, ఉన్నతవిద్యలో రావాల్సిన మార్పులేమిటి? నాలుగు దశాబ్దాలుగా ఉన్నవిద్యారంగంలో విశేష సేవలు అందించారు. IIPE వంటి ప్రతిష్టాత్మక సంస్థ డైరెక్టర్‌గా పనిచేశారు. దేశీయ సాంకేతిక విద్యారంగంలో అభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నో సూచనలు, సలహాలిచ్చారు. విశ్వగురు స్థానం కోసం మన కొత్తబాట ఎలా ఉండాలో ఈ కార్యరక్రమంలో తెలుసుకోవచ్చు.

దళిత, గిరిజనులకు జగన్‌ నమ్మకద్రోహం - విద్య, ఉపాధి అవకాశాలపై దెబ్బ - CM jagan Negligence on SC and ST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.