ETV Bharat / opinion

జగన్​ ఆడంబరాలకు ప్రజా ధనం - అయిదేళ్లు ప్రజా ఖజానాకు చిల్లు - Jagan Misused Public Money

జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న గత ఐదేళ్లలో ప్రజల సంపదను ఎలా దుర్వినియోగం చేశారు? రాష్ట్రాన్ని ఎలా అప్పులపాలు చేశారు? ప్రజల నుంచి రకరకాల పన్నుల పేరుతో వసూలు చేసిన ప్రజాధనాన్ని ఇలా విలాసాలకు ఖర్చు చేయటం ఎంతవరకు సమంజసం? రుషికొండ విషయంలో అధికార యంత్రాంగం గత ప్రభుత్వం ఎలా వ్యవహరించింది? ప్యాలెస్‌ పేరుతో జరిగిన ప్రజాధన దుర్వినియోగం ఎంత? ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని.

pratidwani_debate_on_jagan_misused_public_money
pratidwani_debate_on_jagan_misused_public_money (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 10:38 AM IST

Pratidwani : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రాష్ట్ర ఖజానాను గుల్ల చేసింది. కనీసం రోడ్లు వేయటానికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఆడంబరాలకు ప్రజా ధనాన్ని తగలేసింది. జగన్ సొంత పత్రిక సాక్షి సర్క్యులేషన్‌ పెంచుకోవటం కోసం లక్షలాది కాపీలను ప్రభుత్వ డబ్బుతో వాలంటీర్లకు పంపిణీ చేసింది. జగన్ సర్కార్ రుషికొండను విధ్వంసం చేసి సీఎం ఉండటం కోసం కళ్లు చెదిరే ప్యాలెస్‌ను నిర్మించింది. పరదాలు, బ్యారికేడ్లు కట్టుకుని ప్రజల్లో తిరిగిన మాజీ సీఎం జగన్ 986 మంది సెక్యూరిటీ సిబ్బందిని తన కోసం పెట్టుకోవటం, తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ ముప్పై అడుగులకు పైగా ఇనుప ఫెన్సింగ్‌లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలు బయటకు వస్తున్నాయి. ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. నేటి ప్రతిధ్వనిలో సీనియర్ జర్నలిస్ట్‌, కల్లూరి సురేష్‌ రాజకీయ విశ్లేషకులు, నూర్‌ మహ్మద్‌ పాల్గొన్నారు.

సీఎం స్థానంలో ఉండే జగన్ తన సొంత పత్రిక అయిన సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవటం కోసం ప్రజలు పన్నుల రూపేణా చెల్లించిన డబ్బులను వందలకోట్లు దుర్వినియోగం చేయటం అధికార దుర్వినియోగం కాదా? మాజీ సీఎం జగన్ తను ఇంట్లో ఉన్నప్పుడు భద్రత కోసమే 986మందిని నియమించుకున్నారు. ఇదంతా ప్రజల సొమ్ము కాకపోతే ఇంకెవరిది? దేశంలో ఎక్కడైనా ఇలాంటి పోకడ ఉందా.

YSRCP Government Wasting Public Money: ప్రభుత్వ నిర్వాకం.. ప్రణాళికా లోపంతో రూ. 557 కోట్ల ప్రజాధనం 'పునాదుల' పాలు

విశాఖలోని రుషికొండపై రిసార్ట్‌ పేరుతో ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాలకు పెడుతున్న ఖర్చెంతో తెలుసా? చదరపు అడుగుకు సుమారు 24 వేల 22 రూపాయలు. రుషికొండపై వేంగి, కళింగ, గజపతి, విజయగర బ్లాక్‌ల పేరుతో లక్షా 45 వేల 765 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన భవనాల నిర్మాణానికి చేస్తున్న వ్యయం 350కోట్ల 16 లక్షలు. రిసార్ట్‌ నిర్మిస్తున్నామని ప్రభుత్వం మభ్యపెడుతున్నా కడుతోంది సీఎం క్యాంపు కార్యాలయమేనని లోకం కోడై కూస్తోంది.

Appointment of Staff for Jagan Party Work With People Money: ప్రజల సొమ్మతో వైసీపీకి సేవ.. ఇప్పటికే ఏటా రూ 68 కోట్లు దోపిడీ

గత ప్రభుత్వం అమరావతిలో 6 లక్షల చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాతో నిర్మించిన సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణానికైన ఖర్చు కేవలం 526 కోట్ల 57 లక్షల రూపాయలే. ప్రభుత్వ లెక్కల ప్రకారం వాటి నిర్మాణానికి, బాహ్య, అంతర్గత పనులన్నీ కలిపి చదరపు అడుగుకు చేసిన వ్యయం 6 వేల 70 రూపాయలు మాత్రమే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.