ETV Bharat / opinion

ఉత్తరాంధ్రను వీడిన వైఎస్సార్సీపీ గ్రహణం- కూటమి రాకతో అభివృద్ధిపై ఆశలు - Pratidwani on Uttarandhra

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 19, 2024, 12:19 PM IST

Pratidwani Debate on Uttarandhra Development: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలతో వణికిపోయిన ప్రజలు కూటమి ప్రభుత్వం రాకతో ఊపిరిపీల్చుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి పట్టిన వైఎస్సార్సీపీ గ్రహణం వీడిందని అనుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఉత్తరాంధ్ర జిల్లాల కోసం కూటమి ప్రభుత్వం అడుగులు వేయటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Pratidwani_Debate_on_Uttarandhra_Development
Pratidwani_Debate_on_Uttarandhra_Development (ETV Bharat)

Pratidwani Debate on Uttarandhra Development: ఉత్తరాంధ్రకు పట్టిన గ్రహణం వీడుతోంది. కీలకమైన విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అడుగులు కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. విశాఖ కేంద్రంగా తిరిగి ఐటీ జోరుకు సన్నాహాలు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కదలిక, పోలవరం పూర్తయ్యేలోపే ఉత్తరాంధ్రకు వచ్చే ఏడాది నుంచే నీళ్లు అందించాలన్న ముఖ్యమంత్రి సంకల్పం అందరిదృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇదే సమయంలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వైఎస్సార్సీపీ భూకబ్జాలు, అక్రమాలు, వాటిపై ప్రభుత్వం చర్యలు సిద్ధమవుతూ ఉండడం "హమ్మయ్య" అని అక్కడి వారిని ఊపిరి పీల్చుకునే చేస్తోంది. మరి ఉత్తరాంధ్ర ప్రజలేం కోరుకుంటున్నారు? వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఇంకా ఏం చేయాల్సి ఉంది? అనే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం. నేటి చర్చలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక కో కన్వీనర్ బీశెట్టి బాబ్జీ, విశాఖపట్నం జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పాల్గొన్నారు.

ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అక్రమాలు, అరాచకాలను చూసిన ప్రజలకు.. కూటమి ప్రభుత్వం రావటంతో వారిలో అభివృద్ధిపై ఆశలు చిగిరిస్తున్నాయి. గత ఐదేళ్ల పాలనలో విశాఖ కేంద్రంగా జరిగిన వైఎస్సార్సీపీ నేతలు విచ్చలవిడిగా భూ దోపిడీకి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ భూ అక్రమాలు, కబ్జాలు, అరాచక సెటిల్‌మెంట్లను సరిచేయడానికి కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.

స్మార్ట్ సిటీ సహా విశాఖ అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మహా విశాఖ నగరాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. తరలిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించడం, మెట్రో రైల్ వంటి ఆధునిక వసతుల కల్పన కోసం ప్రయత్నిస్తోంది. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భోగాపురం విమానాశ్రయం రెండేళ్లలో పూర్తి చేస్తామని, పోలవరం పూర్తికాకున్నా వచ్చే ఏడాదికే అక్కడకి నీళ్లిస్తామని సీఎం చంద్రబాబు ప్రజలకు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాకతో ఉత్తరాంధ్ర ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

గత వైఎస్సార్సీపీ భూకబ్జాలతో ఉత్తరాంధ్ర వణికిపోయింది. అనేక ప్రభుత్వ స్థలాలు, కొండలు, ఎర్రమట్టిదిబ్బలు, రుషికొండ, ఖనిజ సంపద, ప్రకృతిసంపదను దోచేశారు. ఆ సంపదను తిరిగి ప్రజాఖజానాకు కట్టబెట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీంతో సంబంధం ఉన్నవారందల్ని విడిచిపెట్టేయాలా? చట్టం అనే పరిధిలో శిక్షించాలా? అనే అంశాలపై మరిన్ని వివరాల కోసం పై వీడియోపై క్లిక్ చేయండి.

పరదాలు కట్టలేదు - చెట్లు పడగొట్టలేదు - హంగు ఆర్భాటం లేకుండా చంద్రబాబు పర్యటన - Chandrababu North Andhra Tour

నదులను అనుసంధానించి రాష్ట్రంలో కరవు లేకుండా చేస్తాం: సీఎం చంద్రబాబు - CM Chandrababu Visit Uttarandhra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.