Pratidhwani : ఒక్కఛాన్స్ అంటూ గద్దెనెక్కి ఐదేళ్లలో విద్యుత్ బిల్లులు అంటేనే గుండెల్లో వణుకు పుట్టేలా చేశారు.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రభుత్వం పోయి నెలలు గడుస్తున్నా వారు చేసిన తప్పులు మాత్రం ప్రజలకు తిప్పలు తెచ్చేలా వెంటాడుతున్నాయి. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ప్రజల నెత్తిన వేలాడుతున్న 20వేల కోట్ల రూపాయలకు పైగా సర్దుబాటు భారమే అందుకు నిదర్శనం. స్థిరఛార్జీలు, ట్రూఅప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఇలా అయిదేళ్లలో జగన్ ఇచ్చిన షాకులకు ఇది అదనం. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ దెబ్బకు కొంతకాలంగా అసలు కన్నా కొసరు ఛార్జీలే భరించలేని భారంగా మారాయి. మరి కొత్త భారాలను ప్రజలు మోయగలరా? విద్యుత్ పంపిణీ సంస్థలు, ప్రభుత్వం ముందున్న మార్గమేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఓ నరేష్‌కుమార్, విద్యుత్ రంగ నిపుణులు వీ గోపాలకృష్ణ.
కనీసం ఏడాదికి ఒకసారి చొప్పు స్థిర ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట జగన్ హయాంలో 5 సార్లు కరెంటు బిల్లులు పెరిగాయి. ఇంకా ఈ సర్దుబాటు బాధ ఎందుకు? నిజానికి ఎన్నికలకు ముందే జరగాల్సిన ఈ ఇంధన సర్దుబాటు ఛార్జీల ప్రజాభిప్రాయ సేకరణ అప్పుడు ఎందుకు వాయిదా పడిదింది? ఇప్పుడు తప్పించుకునే మార్గమే లేదా? జగన్ గతంలో ప్రతిపక్షనేతగా తాను అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లు తగ్గిస్తాను అన్న మాటను ఎందుకు నిలబెట్టుకోలేక పోయారు? అయిదేళ్లు విద్యుత్ రంగంలో అసలేం జరిగింది?
గత ప్రభుత్వ నిర్లక్ష్యం - అటు వెళ్లేందుకు కూడా భయపడుతున్న జనం - Tunnel Situation in Vijayawada
ఒక పారిశ్రామికవేత్తగా వైఎస్సార్సీపీ పాలనలో మీ అనుభవాలు ఏమిటి? డిస్కమ్‌లు ఇంత అప్పులు, ఆర్ధిక సంక్షోభంలో ఎందుకు కూరుకుని పోయాయి? ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపకుండా ఇతర ప్రత్యామ్నాయాలు ఏవి కూటమి ప్రభుత్వం ముందు లేవంటారా? 8 వేల కోట్లకు పైగా ఉన్నసర్దుబాటు ఛార్జీలను జనం భరించే పరిస్థితిలో ఉన్నారా? ప్రజలపై పెద్దగా భారం మోపకుండా ప్రభుత్వం ఏం చేయటానికి అవకాశం ఉంది? వీటన్నింటిని గురించి సమగ్ర సమాచారం ప్రతిధ్వని ద్వారా తెలుసుకుందాం.