ETV Bharat / opinion

కొత్త నేర న్యాయ చట్టాలతో ఎలాంటి మార్పులొస్తాయి ? - Pratidhwani on New Criminal laws

Pratidhwani : ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానంలో 3 కొత్త నేర న్యాయ చట్టాలు వచ్చాయి. నిన్నటి (జూన్​ 1) నుంచి అమల్లోకి వచ్చిన బీఎన్‌ఎస్‌, బీఎన్‌ఎస్‌ఎస్‌, బీఎస్‌ఏ చట్టాలతో ఇకపై జీరో FIR, ఆన్‌లైన్‌ ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాలు అందుబాటులో ఉంటాయి. దీంతో సత్వర విచారణకు మార్గం సుగమమయ్యిందని ప్రభుత్వం ఆశిస్తుంది. కానీ ఈ చట్టాల అమలుతో పోలీసులకు అపరిమిత అధికారాలి‌చ్చారన్న విమర్శలు రేకెత్తుతున్నాయి. ఈ కొత్త చట్టాల గురించి మరింత సమాచారం నేటి ప్రతిధ్వనిలో తెలుసుకుందాం.

pratidhwani_on_new_criminal-laws
pratidhwani_on_new_criminal-laws (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 10:53 AM IST

Pratidhwani : మన దేశంలో బ్రిటిష్‌ కాలం నుంచి అమలవుతున్న ఐపీసీ, సీఆర్‌పీసీ శిక్ష్మాస్మృతుల స్థానంలో మూడు కొత్త నేర న్యాయ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇకపై జీరోఎఫ్‌ఐఆర్‌, ఆన్‌లైన్‌ ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్‌ సాధనాలతో సాక్ష్యాధారాల సేకరణ సులభతరం అవుతుంది. కేసుల సత్వర విచారణకు మార్గం సుగమం అయ్యింది. అయితే ఈ చట్టాల్లో పోలీసులకు అపరిమిత అధికారులు కల్పించారనీ, విస్తృతస్థాయిలో ప్రజాభిప్రాయాలు సేకరించలేదనీ విమర్శలు వస్తున్నాయి. అసలు కొత్తగా అమలులోకి వచ్చిన మూడు నేర న్యాయ చట్టాలతో నేరాల దర్యాప్తు, న్యాయ విచారణలో ఎలాంటి మార్పులొస్తాయి? ఏఏ కేసుల్లో శిక్షలు కఠినతరం అవుతాయి? ఈ చట్టాల రూపకల్పన జరిగిన తీరుపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో డా. బీఆర్‌ అంబేద్కర్‌ న్యాయ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న, లీగల్‌ అంశాల వ్యాసకర్త పీవీఎస్‌ శైలజ, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి, మాజీ ఐజీపీ ఎస్‌. ఉమాపతి పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు.

క్రిమినల్​ చట్టాల్లో నూతన అధ్యయనం - ఇకపై ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదుకు అవకాశం - new criminal laws in india

నేరానికి తగ్గ శిక్షల్లేని సమాజంలో అరాచకత్వం రాజ్యమేలుతుంది. అయిదుకోట్ల పెండింగ్‌ కేసుల కొండ కింద నేర న్యాయ వ్యవస్థే కుదేలైపోతున్న వేళ- అభాగ్యులకు సత్వర న్యాయం అందించేలా భిన్న స్థాయుల్లో విస్తృత సంప్రతింపులతో ఓ మహా యజ్ఞంలా శాసన నిర్మాణం జరగాలి. ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు, వీడియో ద్వారాను, నిందితుల పరోక్షంలోనూ విచారణలతో సత్వర న్యాయం చేయనున్నామన్న కేంద్రం- దేశద్రోహ నిర్వచనాన్ని విస్తృతపరచి, మూక దాడుల్నీ శిక్షార్హం చేసి, అవినీతి, ఉగ్రవాదం, సంఘటిత నేరాల్ని కొత్త చట్టాల చట్రంలో బిగించి నేటి అవసరాలకు దీటుగా రాణించామంటోంది. కొత్త చట్టాల ప్రకారం పిటిషన్లు దాఖలు కాలేదంటూ కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ ఈ మధ్యే వ్యక్తీకరించిన అభ్యంతరాలు న్యాయ పాలికలో గందరగోళానికి అద్దం పడుతున్నాయి.

ఈ గణతంత్ర దినోత్సవం లోగా చట్టాల్ని నోటిఫై చేస్తామని, అందులో పేర్కొన్న తేదీ నుంచి అవి అమలులోకి వస్తాయని కేంద్రం వివరిస్తోంది. అహ్మదాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టును రెండు నెలల్లో చేపట్టి, ఏడాదిలోగా దేశంలో 90 శాతానికి చట్టం అమలును విస్తరిస్తామంటోంది. దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు మూడు వేలమందిని సిద్ధం చేశామని, ఆ క్రతువును పోలీస్‌ పరిశోధన అభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తుందంటున్నారు. రెండు దశాబ్దాల నాడే జస్టిస్‌ మలీమత్‌ కమిటీ సూచించినట్లు- దిగువ కోర్టుల్లో జడ్జీలు, ప్రాసిక్యూటర్లకూ కొత్త చట్టాల నిబంధనల్ని బోధపరచి, వారి పని సామర్థ్యం పెంపొందించడం పైనా దృష్టి సారించక తప్పదు. న్యాయపాలికకే నయా బోధనాంశాలు కానున్న చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టి, జన విశ్వాసానికి గొడుగు పట్టేవిగా ఉండి తీరాలి. అందుకు వీలుగా న్యాయ కోవిదుల సూచనలకు విలువ ఇచ్చి హేతుబద్ధ సవరణలకు కేంద్రం సిద్ధం కావాలి!

అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు- ఇకపై ఆ నేరాలకు పాల్పడితే అంతే సంగతి! - New Criminal Laws In India 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.