ETV Bharat / opinion

ప్రజలకు నాకు మధ్య అడ్డు గోడలు ఉండకూడదన్న చంద్రబాబు- వైఎస్సార్సీపీ పాలనలో పొరపాట్లే కూటమికి పాఠాలు - Prathidwani On YCP Rule

Prathidwani On YCP Rule Lessons For The Alliance AP : పరదాల మాటున ఉండి ప్రజా జీవితాలను సుగమం చెయ్యలేక పొయిన జగన్​ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. ఏవైతే తప్పులు గత ప్రభుత్వం చేసిందో అవే మనకు పాఠాలు అంటూ నేతలకు సూచనలిస్తున్నారు సీఎం. ఈ అంశం నేటి ప్రతిధ్వని.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 2:03 PM IST

prathidwani
prathidwani (ETV Bharat)

Prathidwani On YCP Rule Lessons For The Alliance AP : ప్రజలకు తనకు మధ్య అడ్డు గోడలు ఉండకూడదని చంద్రబాబు వ్యాఖ్యనించారు . పరదాల సంస్కృతి రుచించని ప్రజలు జగన్​ను తిరస్కరించారు. ప్రకృతి సంపదను దోపిడీ చేసిన గత ప్రభుత్వ పెద్దలకు, అధికారం ఇచ్చారనే అహంభావంతో రౌడీయిజం చేసి జనాలను ఇబ్బందులకు గురిచేసిన వైఎస్సార్సీపీ నాయకులకు ప్రజలు బుద్ది చెప్పారు. పోలీసు సహా వ్యవస్థలు అన్నింటినీ దుర్వినియోగం చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించటంలో వైఫల్యం చెందిన వారికి తగిన శాస్తి జరిగేలా తీర్పునిచ్చారు. అధికారపార్టీ నాయకుల చెప్పు చేతల్లో ప్రభుత్వ యంత్రాంగం కీలు బొమ్మగా మార్చి ఇసుక సహా అన్ని ఖనిజాలు దోచుకున్న వైఎస్సార్​సీపీ లీడర్లు నేడు ఓటమిని చవిచూడక తప్పలేదు. వైఎస్సార్సీపీ పాలనలో చేసిన పొరపాట్లే నేడు కూటమికి పాఠాలు అనే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం. చర్చలో పాల్గొంటున్న వారు ఏపీ సమగ్రాభివృద్ధి వేదిక కన్వీనర్ టి. లక్ష్మీనారాయణ, రాజకీయ విశ్లేషకులు డీవీ శ్రీనివాస్.

కానీ నేడు కూటమి నేత, సీఎం చంద్రబాబు కనీసం తాను వస్తున్నప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని హితవు పలికారు. సీఎం వచ్చేప్పుడు కూడా ట్రాఫిక్ ఆపవద్దని పోలీసులకు సూచనలు చేశారు. కూటమి ప్రజాప్రతినిధులు కూడా పద్దతిగా ఉండాలని హెచ‌్చరించారు. కుటుంబ సభ్యులను అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్న సీఎం పార్టీ నేతలకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మనం చేయవద్దన్న చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు మంచి ప్రజాదరణ పొందుతూ నిరాడంబరంగా, వివాదాలకు దూరంగా ఉంటూ తోటి వారికి అదే మార్గాన్ని పాటించాలని సూచిస్తున్నారు.

ఉచిత ఇసుక విధానంలో జోక్యం వద్దు - అధికారాన్ని తలకెక్కించుకోవద్దు - మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన - CBN instructions to ministers

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఆర్థిక, ఆర్థికేతర అంశాలేవో చూసుకుని ఆర్థికేతర అంశాల అమలుపై వెంటనే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం మంత్రివర్గ సమావేశం ముగిశాక సహచర మంత్రులతో జరిగిన అంతర్గత భేటీలో వివిధ కీలక అంశాలు చర్చకువచ్చాయి. మంత్రులు తరచూ క్షేత్ర పర్యటనలకు వెళ్లాలని సూచించిన సీఎం అధికారిక వ్యవహారాల్లో కుటుంబసభ్యుల జోక్యం వద్దని హితబోధ చేశారు. ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో వైఎస్సార్సీపీ అదే పనిగా బురద జల్లుతోందని, దాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని సీఎం సూచించారు.

రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తల చూపు - తిరిగొస్తున్న ఇండస్ట్రియల్ దిగ్గజాలు - Industries for Andhra Pradesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.