ETV Bharat / opinion

స్వామి భక్తిలో ఐఏఎస్, ఐపీఎస్​లు- తప్పులు తప్పించుకోవడం సాధ్యమేనా? - Ias Officers Support Ysrcp Irregularities - IAS OFFICERS SUPPORT YSRCP IRREGULARITIES

Prathidwani: దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించేది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రే అయినా వెనక ఉండి వారిని నడిపించేది మాత్రం సివిల్ సర్వెంట్స్ అనబడే ఐఏఎస్, ఐపీఎస్​లు. వీరిలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలకు సాగిలపడిపోయి అధికార పార్టీ కార్యకర్తల్లా పని చేశారు. చట్టాలను దారుణంగా ఉల్లంఘించారు. ప్రజా సంపదను దోచుకుంటున్న వైఎస్సార్సీపీ నాయకులకు అండగా నిలిచారు. చేసిన తప్పుల నుంచి తప్పించుకుని పోవటం సాధ్యమేనా? ఇదీ నేటి ప్రతిధ్వని.

Prathidhwani
Prathidhwani (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 12:10 PM IST

Prathidwani : దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించేది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రే అయినా వెనక ఉండి వారిని నడిపించేది మాత్రం సివిల్ సర్వెంట్స్ అనబడే ఐఏఎస్, ఐపీఎస్​లు. వీరిలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్​లు గత ఐదేళ్లుగా తమ వృత్తికి కళంకం తీసుకుని వస్తున్నారు. తమ స్వీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో చేతులు కలిపారు. చట్టాలను దారుణంగా ఉల్లంఘించారు. ప్రజా సంపదను దోచుకుంటున్న వైఎస్సార్సీపీ నాయకులకు అండగా నిలిచారు. ఎన్నికల ప్రక్రియను సైతం అపహాస్యం చేశారు. జగన్​ మోహన్ రెడ్డిని విమర్శించే వారిని చట్టవిరుద్ధంగా వెంటాడారు. అక్రమ కేసులు మోపి ఇబ్బందులు పెట్టారు. ప్రజలు ఆ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలోకి విసిరేయటంతో వారి గుండెల్లో రాయిపడింది. కొత్త ప్రభుత్వం కొలువుతీరే లోపు జంప్ అయిపోవాలని వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? చేసిన తప్పుల నుంచి తప్పించుకుని పోవటం సాధ్యమేనా? ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో ఏపీ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు, రాజకీయ విశ్లేషకులు ఏ. రాజేష్‌ పాల్గొన్నారు.

కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలకు సాగిలపడిపోయి అధికార పార్టీ కార్యకర్తల్లా పని చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల అవినీతికి, అక్రమ సంపాదనకు అండగా నిలుస్తూ యథేచ్ఛగా సాగిన వనరుల దోపిడీకి పూర్తిగా సహకరించారు. ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల కోసం అడ్డగోలుగా వ్యవహరించి, నిబంధనలు తుంగలోతొక్కి న్యాయస్థానంలో దోషులుగానూ నిలబడ్డారు. మరి అంలాంటి అధికారులపై కొత్త ప్రభుత్వం కొలువుతీరాక ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ - ఉత్తర్వులు జారీ - AP NEW CS Neerabh Kumar

జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారులు ఎంతగా నిబంధనల్ని తుంగలో తొక్కారో రాస్తూ పోతే పెద్ద గ్రంథమే అవుతుంది. వివిధ కేసుల్లో కొందరు అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించి వారి విజ్ఞప్తి మేరకు దాన్ని సేవా శిక్షగా మార్చిన సందర్భాలూ ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలకు తాబేదార్లలా పనిచేసే ఇలాంటి అధికారులను చరిత్రలో చూడలేదని ఎన్ని విమర్శలొచ్చినా, కోర్టులు మొట్టికాయలు వేసినా ఆ అధికారులు వైకాపా ఎజెండాను భుజాన మోయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించారు. అధికారంలో ఉన్నవాళ్లు ఎన్ని చెప్పినా నిబంధనలకు అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత అధికారులదే.

ప్రభుత్వ భవనాలన్నిటికీ వైఎస్సార్సీపీ రంగులు వేయమని జగన్‌ ప్రభుత్వం ఆదేశిస్తే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అది సరికాదని చెప్పలేదు. అదే వైఎస్సార్సీపీ రంగుల్ని మీ ఒంటికి వేసుకుని సమావేశాలకు రండని జగన్‌ ఆదేశిస్తే ఆ అధికారులు వేసుకుని వెళ్లేవారా? మరి వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికి ఎందుకు అంగీకరించారు? ప్రజల సొమ్ము కాబట్టి ఎంత వృథా జరిగినా పర్వాలేదా? అనే విమర్శలు వినిపించాయి.

అన్నింటికీ అయ్యా'ఎస్​' అనేశారు- అక్రమాలకు ఆజ్యం పోశారు! - IAS Officers Supporting YSRCP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.