ETV Bharat / opinion

ముస్లింలకు జగన్‌ చేసిందేంటి ? - మైనార్టీల మనోభావాలు ఎలా ఉన్నాయి ? - What CM Jagan did to minorities - WHAT CM JAGAN DID TO MINORITIES

Prathidwani: రాష్ట్రంలో జగన్‌ అయిదేళ్ల పాలనలో ముస్లిం మైనార్టీలకు మిగిలింది దోకాయేనా? "నా మైనార్టీలూ అంటూనే, వారికి తీరని అన్యాయం చేస్తున్నారా అంటే అవును అనే అంటున్నాయి ముస్లిం హక్కుల పోరాట సంఘాలు. అన్నిరంగాల్లో అన్యాయం చేశారని, పథకాల నుంచి తమ ప్రయోజనాల పరిరక్షణ వరకు ప్రతిచోటా మొండిచెయ్యే చూపారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు అయిదేళ్లలో ముస్లింలకు జగన్‌ చేసిందేంటి? టీడీపీ పథకాలను ఎందుకు ఆపేశారు? ఈ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల తీర్పు ఎటు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.

Prathidwani
Prathidwani
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 1:36 PM IST

Prathidwani: ముస్లింలను ఆత్మబంధువులన్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఏం జరిగింది? వైసీపీ నాయకులు రెచ్చిపోయి ముస్లింలపై దాడులు చేస్తుంటే కళ్లప్పగించి చూస్తుండిపోయారు. మైనార్టీ యువతుల్ని వేధించిన వారినీ చట్టం ముందు నిలబెట్టకుండా వదిలేశారు.

దుల్హన్, రంజాన్ తోఫా, విదేశీ విద్య లాంటి పథకాల్ని పక్కన పెట్టేశారు. ఇస్లామిక్ బ్యాంక్ సంగతి సరేసరి. ఐదేళ్ల జగన్ పాలనలో దాడులు, వేధింపులు, కోతల సంక్షేమం తప్ప, ముస్లింలకు ఒరిగిందేంటి? మైనార్టీల మనోభావాలు ఎలా ఉన్నాయి? ఈసారి వాళ్ల తీర్పు ఎటు? ఇదీ నేటి అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. దీనిపై చర్చించేందుకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ, ముస్లిం ఉద్యమనాయకులు, న్యాయవాది బషీర్‌ అహ్మద్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ముస్లిం మైనార్టీలకు మిగిలింది దోకాయేనా?

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభల్లో నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటూ ప్రేమ కురిపిస్తున్నా ఆచరణలో మాత్రం వారిని ఆదుకున్నది లేదు. తన పదవీకాలంలో ముస్లిం, మైనార్టీల ప్రజలకిచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదనే చెప్పాలి. ముస్లిం మైనార్టీలు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి గుంటూరు ఒకటి. ఇక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా ఈ జనాభా సంఖ్య ఎక్కువే. సగటున 20 వేల నుంచి 40 వేల వరకు వారి ఓట్లు ఉన్నాయి.

గుంటూరు తూర్పులో అయితే అత్యధికంగా 50 వేలకు పైబడి ఓటర్లు ఉన్నారు. వైసీపీ హయాంలో ఈ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి జగన్‌ కొత్తగా ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టకపోగా మేనిఫెస్టోలో ఇచ్చినవి అమలు చేయకుండా విస్మరించారు. గత టీడీపీ ప్రభుత్వం ముస్లింలకు ఏటా రంజాన్‌ తోఫా అందజేసింది. ఈ అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్కసారీ ఇవ్వలేదు. ఒక్క ఉమ్మడి గుంటూరులోనే ఈ పథకానికి 4 లక్షల మంది లబ్ధిదారులు ఉండేవారు.

Prathidhwani: నాలుగేళ్లలో ముస్లింలకు వైసీపీ సర్కార్ చేసిందేమిటి?

దుల్హన్‌ పథకం అంతే: దుల్హన్‌ పథకం పేద ముస్లిం యువతకు పెళ్లిళ్లు చేసి వారు జీవితంలో స్థిరపడేలా పెళ్లి ఖర్చులతో పాటు స్వయం ఉపాధికి చర్యలు తీసుకుంది. ఒకే రోజు సామూహిక వివాహాలు జరిపించి వధూవరుల తరఫు వారికి భోజనాలు పెట్టించడంతో పాటు బీరువా వంటివి కొనుగోలు చేసి ఇచ్చారు. షాదీముబార్‌ కింద తక్షణ సాయంగా వాటిని అందించారు. వైసీపీ ప్రభుత్వం దాన్ని ఎత్తివేసింది. వైఎస్సార్‌ కానుకగా రూ.లక్ష ఇస్తామని ఏడాది క్రితం ప్రకటించింది. దీనికి దరఖాస్తులు అయితే స్వీకరించింది కానీ ఇప్పటివరకు సాయం అందించలేదు.

రద్దు చేయడమే తెలుసు: వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలను కొనసాగించకపోగా ఉన్నవి రద్దు చేసింది. అయిదేళ్ల హయాంలో వీరికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ముస్లిం, మైనార్టీల ద్రోహిగా ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి మిగిలిపోయారని ఆ వర్గం ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఉర్దూను రెండో బాషగా చేస్తామని హామీ ఇచ్చి దాని ఊసే విస్మరించింది.

రాష్ట్రవ్యాప్తంగా నెత్తురు పారించిన జగన్‌ ముఠా - తాలిబాన్లలా వైసీపీ అకృత్యాలు - ysrcp attacks in ap

కొరవడిన భద్రత: అన్నింటికి మించి ఆ వర్గాలపై దాడులు పెరిగిపోవడంతో వారికి భద్రత లేకుండా పోయింది. ఏడాది క్రితం గుంటూరు నగరంలో ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ వర్గీయులు సుభాని అనే మైనార్టీ యువకుడిపై దాడి చేస్తే బాధితుడు పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు కాకుండా ఎమ్మెల్యే గిరిధర్‌ అడ్డుకున్నారు.

పత్తా లేని విదేశీవిద్య: విదేశీ విద్యతో వేలాది మంది విద్యార్థులను విదేశాలకు పంపి వారి ఉన్నత చదువులకు చేయూతనిచ్చింది. ఈ పథకం కింద ఉమ్మడి గుంటూరు నుంచి వెయ్యి మందికి పైగా విదేశాలకు వెళ్లి ఎంఎస్‌ పూర్తి చేశారు. పాఠశాల, కళాశాల విద్య చదివే ముస్లిం, మైనార్టీల విద్యార్థులకు ఏటా రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు ఉపకారవేతనాలు ఇచ్చేవారు. వాటిని పూర్తిగా రద్దు చేసింది.

జగన్ పాలనలో బ్రాహ్మణుల ముఖాల్లో సంతోషం నిండిందా? - జీవితాలు మారాయా? - attacks on brahmins in AP

వక్ఫ్‌ భూముల రక్షణ కాదు భక్షణ: అన్యాక్రాంతమైన వక్ఫ్‌బోర్డుకు చెందిన భూముల్ని రీ సర్వేలో గుర్తించి వాటి రక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి విస్మరించింది. ఉమ్మడి గుంటూరులో 250 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు వక్ఫ్‌బోర్డు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించినా వాటి స్వాధీనానికి చర్యలు తీసుకోలేదు.

ఇవే కాకుండా వైసీపీ పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయన్న ముస్లింల ఆందోళనకు కారణమేంటి? ఎక్కడెక్కడ ముస్లింలపై దాడులు జరిగాయి? ఇలాంటి సందర్భాల్లో వక్ఫ్‌ బోర్డు మీకు అండగా ఉంటోందా? ఇలా పలు ప్రశ్నలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో వక్తలు చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కోసం పైన లింక్​పై క్లిక్ చేసి చూడండి.

ఎన్నికల ముందు జగన్​ మాయ మాటలు - ఐదేళ్లలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చేసిందేంటి ? - Jagan lied employees and teachers

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.