Prathidhwani on Private Schools Fees Increased : పోటీపరీక్షల్లో నెగ్గుకురావాలంటే ప్రైవేట్ స్కూళ్లలో చదవాలన్న భావన వల్ల తల్లిదండ్రులు ప్రైవేట్ చదువులపై మొగ్గుచూపుతున్నారు. దీంతో తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పనిచేసిన డబ్బంతా పిల్లల ఫీజుల కోసం ఖర్చు చేస్తున్నారు. ప్లే స్కూల్స్, టెక్నో, ఇంటర్నేషనల్, ఈ-టెక్నో, ఒలింపియాడ్ వంటి పేర్లతో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రుల నుండి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.
పేరెంట్స్ నమ్మకాన్ని అవి అవకాశంగా మలుచుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న డిమాండ్ పెరుగుతోంది. అసలు తెలంగాణలో పాఠశాలల్లో ఫీజుల నిర్ణయం ఎలా జరుగుతోంది? రాష్ట్రంలో ఫీజుల నియంత్రణపై వేసిన గత కమిటీలు ఏం చెప్పాయి? బడుల్లో ఫీజులపై విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది?. స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు పలు రాష్ట్రాలు చట్టాలు చేశాయి. ప్రైవేట్, కార్పొరేట్, ఎయిడెడ్ పాఠశాలల ఫీజులు పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు భరించగలిగే స్థాయిలో ఉన్నాయా? ఫీజులపై చట్టం తయారీ దిశగా ప్రభుత్వం ఎప్పుడు అడుగులేస్తుంది? ఇదే నేటి ప్రతిధ్వని.