ETV Bharat / opinion

రాజకీయ రణక్షేత్రంలో కీలకంగా కోస్తాంధ్ర - ఈసారి ప్రజలు కూటమికి పట్టం కడతారా? - Coastal Andhra Voter

Prathidwani Debate on Coastal Andhra Voters: కోస్తాంధ్రలో రాజకీయ చైతన్యంతో పాటు సీట్ల సంఖ్య కూడా అధికం. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికారం ఒడిసి పట్టాలంటే కోస్తాంధ్రలో నెగ్గడం కీలకం కానుంది. గత ఎన్నికల్లో విడివిడిగా టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేశాయి. ఈసారి కలిసి మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. అయిదేళ్ల కిందట వైసీపీకు పట్టంగట్టిన కోస్తాంధ్ర ఓటరు ఈసారి ఎవరివైపు నిలుస్తారో? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.

Prathidwani_Debate_on_Coastal_Andhra_Voters

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 2:46 PM IST

Prathidwani Debate on Coastal Andhra Voters: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ రణక్షేత్రంలో కోస్తాంధ్ర కీలకం. అక్కడ రాజకీయ చైతన్యమే కాదు, సీట్ల సంఖ్య కూడా ఎక్కువే. నెంబర్‌ గేమ్‌గా పేరొందిన ఎన్నికల్లో పైచేయి సాధించాలంటే అత్యధిక స్థానాలున్న కోస్తాంధ్రలో ఎక్కువ సీట్లు సాధించాలి. ఈసారి కోస్తాంధ్రలో పబ్లిక్ పల్స్‌ ఎలా ఉంది? ఐదేళ్ల కిందట వైసీపీకి పట్టం గట్టిన ఓటరు, ఈసారి ఏం చేయబోతున్నాడు? ఏ జిల్లాలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి? ఇదే నేటి ప్రతిధ్వని కార్యక్రమం. ఈ కార్యక్రమంలోని చర్చలో రాజకీయ విశ్లేషకులు ఎస్పీ సాహెబ్‌, దాసరి రాజా పాల్గొన్నారు. వారు ఏం చెప్పారో తెలుసుకుందాం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గత ఎన్నికల్లో కోస్తాంధ్రను వైసీపీ కమ్మేసింది. ఐదేళ్ల తర్వాత ఏ పరిస్థితుల్లో భిన్నంగా ఉన్నాయి. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ అయిపోయాయని రాజకీయ విశ్లేషకుడు సాహెబ్ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వ్యాపారాలు పెట్టుకోవడం వలన, ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. అదే విధంగా ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. చాలా మంది ఎమ్మెల్యేలు రైస్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తాగు నీటి సమస్య సైతం తీవ్రంగా ఉందని తెలిపారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారని అన్నారు. కోస్తాంధ్రలో ఉన్న నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.

కూటమి చేతిలో జగన్ ఓటమి ఖాయమా?- అందుకే ప్రలోభాల పర్వం ప్రారంభించారా?

గత ఎన్నికల్లో కోస్తాంధ్రలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. ఈసారి కలిసి పోటీ చేయబోతున్నారు. విపక్ష కూటమి ద్వారా తమకు మేలు జరుగుతుందని నిరుద్యోగులు, ప్రజలు భావిస్తున్నారని సాహెబ్ తెలిపారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మేలు చేస్తుందని నమ్మి ఓటు వేశారని, కానీ ప్రజల నమ్మకాలను నిలబెట్టుకోలేదని అన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని పేర్కొన్నారు.

ఐదేళ్ల కిందట నెల్లూరు జిల్లాను స్వీప్‌ చేసిన వైసీపీ, ఇప్పుడు వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితి ఏంటి? ప్రకాశం జిల్లాలో వలసలు, గ్రూపు తగాదాలు వైసీపీను వెంటాడుతున్నాయి. ప్రకాశం ఎన్నికల రణక్షేత్రంలో ఎవరి బలాబలాలేంటి? గాలి ఎటువైపు వీస్తోంది? తెలుగుదేశానికి గట్టి పట్టున్న కృష్ణా జిల్లాలో గత ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ, ఈసారి వలసలు, సీట్ల మార్పులతో సతమతమవుతోంది. ఎన్నికల ముఖచిత్రం ఎలా ఉండే అవకాశం ఉంది? అనే పలు ప్రశ్నలకు కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు సమాధానాలు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి కార్యక్రమాన్ని పైన లింక్​పై క్లిక్ చేసి చూడండి.

వైసీపీ మంత్రులు తమ శాఖలకు ఏం న్యాయం చేశారు? - వారికి ఎన్ని మార్కులు వేయవచ్చు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.