ETV Bharat / opinion

విస్తుపోయేలా వైఎస్సార్సీపీ నేతల భూదోపిడీ - అయిదేళ్లుగా ఏం జరిగింది? - PRATHIDWANI ON YSRCP LAND GRABS - PRATHIDWANI ON YSRCP LAND GRABS

Prathidwani Debate on YSRCP Leaders Land Grabs: రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ అంతులేని అక్రమాలు, భూ దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి వివాదం వెనక నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ కీలకనేతల పేర్లే తేలుతున్నాయి. దీంతో వైఎస్సార్సీపీ నేతల భూ అక్రమాల లోతెంత? బాధితులకు ఎలా న్యాయం చేయాలి? అనే అంశంపై నేటి ప్రతిధ్వని.

Prathidhwani_Debate_on_YSRCP_Leaders_Land_Grabs
Prathidhwani_Debate_on_YSRCP_Leaders_Land_Grabs (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 12:13 PM IST

Prathidwani : ఊరికో భూ బకాసురుడు.. వేలల్లో బాధితులు! విశాఖ నుంచి మదనపల్లె వరకు ఏ వివాదం చూసినా వేలకు వేల ఎకరాలకు సంబంధించి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. లెక్కకు మిక్కిలిగా కబ్జాలు, ఆక్రమణలు విస్తుబోయేలా చేస్తున్నాయి. ఒకచోట పెద్దిరెడ్డి, మరోచోట విజయ సాయిరెడ్డి, ఇంకోచోట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఇలా ప్రతి వివాదం వెనక నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలకనేతల పేర్లే తేలుతున్నాయి.

మదనపల్లెలో తండోతండాలుగా రెవిన్యూ ఆఫీసులకు తరలి వస్తున్న పెద్దిరెడ్డి బాధితుల క్యూలు పెద్దజాతరనే తలపిస్తున్నాయి. అసలు రాష్ట్రంలో అయిదేళ్లుగా ఏం జరిగింది? వైఎస్సార్సీపీ భూ రాబందుల దోపిడీ మొత్తం బయటపెట్టి, బాధితులకు న్యాయం చేయాలంటే కూటమిప్రభుత్వం ముందున్న మార్గమేంటి? అనే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం. నేటి చర్చలో కడపకు చెందిన ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, గుంటూరుకు చెందిన రాజకీయ విశ్లేషకుడు ఎం. సుబ్బారావు పాల్గొన్నారు.

వైఎస్సార్సీపీ నేతల కబంధ హస్తాల్లో ప్రభుత్వ స్థలాలు- అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు - YSRCP Encroached Heavy Lands

మదనపల్లెలో ఫైళ్ల దహనం ఘటన తర్వాత రెవిన్యూ ఆఫీసులకు తరలివస్తున్న మాజీమంత్రి పెద్దిరెడ్డి భూ బాధితుల సంఖ్య జాతరనే తలపిస్తోంది. మదనపల్లె సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల కాల్చివేత ఘటనతో పెద్దిరెడ్డి పాత్ర, భూ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మదనపల్లెలో పెద్దిరెడ్డి, పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విశాఖలో విజయసాయి రెడ్డి.. ఇలా ఊరికో భూబకాసురుడు కనిపిస్తున్నాడు. దీంతో అసలు గడిచిన అయిదేళ్లుగా జరిగింది?, వాళ్లంతా ఇంతగా ఎలా బరితెగించారు? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ అంతూ దరీ లేని భూ కబ్జాలు, వాటికి అండగ నిలిచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం, వారు తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. ఇవన్నీ కొనసాగి ఉంటే ప్రజల పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ వందల కోట్ల విలువైన ప్రైమ్‌ల్యాండ్‌లను పార్టీఆఫీస్‌ల పేరుతో వైఎస్సార్సీపీ కొట్టేసిందని ఆరోపణలు ఉన్నాయి. చివరకు పేదల ఇళ్లపట్టాల పేరుతో కూడా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు 10వేల ఎకరాలు కొట్టేశారని ప్రభుత్వం శ్వేతపత్రాల్లో వెల్లడించారు. వైఎస్సార్సీపీ నేతలు గత ఐదేళ్లలో అధికారం అడ్డుపెట్టుకుని ఆన్‌లైన్‌లో, రికార్డుల్లో హక్కుదార్ల పేర్లు మార్చి సాధారణ ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. చివరకి వాళ్లంతా తమ ఆస్తులకు తామే యజమానులమని నిరూపించుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది.

మా భూములు ఆక్రమించి మాపైనే కేసులు పెట్టారు: పెద్దిరెడ్డి బాధితుల ఆవేదన - PEDDIREDDY VICTIMS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.