Rythu Bharosa For Tenant Farmers Prathidwani : పంటల సాగులో కౌలు రైతులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే విత్తనాలు, ఎరువుల సబ్సిడీ నుంచి బ్యాంకు రుణాల మంజూరు వరకు కనీస సాయం పొందలేని ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కౌలు రైతులు. ఈ కష్టాల్ని తప్పించేందుకు రైతు భరోసా వర్తింపజేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కౌలు రైతులకు ఉపశమనం కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో 75శాతానికి పైగా కౌలు రైతులే ఉన్నట్లు సామాజిక, ఆర్థిక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతు భరోసా అమలైతే కౌలు రైతులకు ఎలాంటి మేలు జరుగుతుంది? అసలు ఇప్పటి వరకు కౌలు రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు ఎందుకు అందలేదు? ఇకపై క్షేత్రస్థాయిలో కౌలు రైతులకు గుర్తింపు ఎలా ఇస్తారు? వీరికి రైతు భరోసా అందిస్తే వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? ఇదే నేటి ప్రతిధ్వని.