Prathidhwani Debate On Health Precautions During Summer : రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. వేడికి జనం అల్లాడి పోతున్నారు. ఆదిలాబాద్, కుమరం భీం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటిపోయాయి. ఉదయం 9 గంటలు దాటితే ఉక్కపోత చికాకు పెడుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో పిల్లలు, వృద్ధులు ఎండవేడిమిని తట్టుకోలేకపోతున్నారు. తలనొప్పి, ఒళ్లు మంటలు, డీ హైడ్రేషన్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఉదయం ఎండలో వ్యాయామం చేసేవారు, సాయంత్రం నడక అలవాటున్నవారు, పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఎలాంటి మార్పులు చేసుకోవాలి. వైద్య, ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లు ఎలా ఉండాలి. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు ఏఏ అంశాలపై దృష్టి సారించాలి. ఈ ఎండల వేడి ఇంకా ఎంతమేరకు పెరగొచ్చు? ఈ పరిస్థితుల్లో వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రయాణాల్లో ఎలాంటి అప్రమత్తత అవసరం? ప్రభుత్వం వైపు నుంచి చేపట్టాల్సిన చర్యలపై ఈరోజు ప్రతిధ్వని.