Prathidhwani Debate on Board Exams : పరీక్షలను ఒక పండుగలా భావించాలే గాని జీవితానికే యమగండంలాగా పరిగణించకూడదు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో విద్యార్థులకు చెప్పిన హితబోధ ఇది. కానీ వాస్తవంలో జరుగుతున్నదేమిటి? వార్షిక పరీక్షల్లో మార్కుల రేసు ఎంతోమంది జీవితాల్ని తలకిందులు చేస్తోంది. లక్షలమంది విద్యార్థులు ఒత్తిళ్ల పొత్తిళ్లలో చిక్కి కుంగిపోతున్నారు. పరీక్షల ఒత్తిడి, మానసిక ఆందోళన, తీవ్ర భావోద్వేగాలు అనేకమందిని బలి తీసుకుంటున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Central Govt Decision Board Exams Twice a Year : సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రాధాన్యతేంటి? ఒత్తిళ్ల ఊబి నుంచి విద్యార్థుల్ని బయటపడేయడానికి ఇంకేం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.