Pratidhwani : అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకీ హోరాహోరీగా మారుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మాజీ అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడి వారసురాలిగా దూసుకువచ్చిన కమలాహారిస్ మధ్య మాటల తూటాలు, మారుతున్న లీడ్లే అందుకు కారణం. ఎన్నికలు జరిగే నవంబర్-5 వైపు కాలం వేగంగా కరిగిపోతుండడంతో ఇరుశిబిరాలు ప్రచారాన్ని పీక్స్‌కు చేర్చాయి. ఎన్నికల ఘట్టం చివరిదశలో పై చేయి కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
హోరాహోరీగా ప్రచారం : ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఆయన గ్రాఫ్ పెంచితే, బైడెన్ స్థానంలో కమలా హారిస్ దూకుడు డెమోక్రాట్లకు కొత్త ఊపిరులు అందించింది. మరి వీరిద్దరి మధ్య సగటు అమెరికన్ ఓటర్ ఏం ఆలోచిస్తున్నాడు? రిపబ్లికన్లు, డెమెక్రాట్ల మధ్య ఎవరి ఛాన్సెస్ ఎంత? ఎవరు గెలిస్తే ఆ ప్రభావం ఇండియాపై ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో పొలిటియో రీసెర్చ్ ఫౌండేషన్ సంజయ్ పులిపాక, అమెరికాకు చెందిన జార్జ్ మాసన్ యూనివర్సిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్ మోహన్ వీ పాల్గొన్నారు
సర్వత్రా ఉత్కంఠ : అమెరికా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో మొదటిది. ఆయుధాలు, ఆదాయం, టెక్నాలజీ, అభివృద్ధి ఇలా ఎలా చూసుకున్నా అమెరికాకు మరే దేశం సాటిరాదు. అలాంటి అగ్రరాజ్యంలో ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య మాటల యుద్ధాలు, టీవీ చర్చ వేదికలపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. అటు అమెరికా ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోంది. రిపబ్లిక్, డెమోక్రటిక్ పార్టీల తరఫున ఎవరు గెలిస్తే ఎవరికి ఎంత లాభం అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
వరుసగా పారిశ్రామిక ప్రమాదాలు - వాటి నుంచి పాఠాలు ఎప్పటికి నేర్చుకుంటాం? - Industrial Accidents
వివేక్ రామస్వామి తీవ్ర విమర్శలు : మరోవైపు కమలా హారిస్‌పై రిపబ్లికన్ పార్టీనేత వివేక్ రామస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. కమలా హరిస్‌ను ఆయన ఓ కీలుబొమ్మగా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ డ్రంప్ సరైన వ్యక్తి అని కొనియాడారు. ఆయన విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే డెమొక్రటిక్ పార్టీ సరిహద్దు భద్రతా విధానాన్ని కూడా రామస్వామి తప్పుబట్టారు. చట్టప్రకారం అమెరికాకు వచ్చిన వారికి ఆ విధానం ప్రమాదకరమని పేర్కొన్నారు.