ETV Bharat / opinion

కర్ణాటకపై BJP స్పెషల్ ఫోకస్​- మైసూర్​ యువరాజుకు టికెట్- 2019 సీన్​ రిపీట్​కు పక్కా ప్లాన్! - lok sabha bjp candidates list

Mysore King Yaduveer Contest Lok Sabha Election 2024 : దక్షిణాదిలోనూ భారీగా ఎంపీ సీట్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. కర్ణాటకలో మొత్తం 20మంది అభ్యర్థులను ప్రకటించగా అందులో 8మంది సిట్టింగ్​లకు చోటివ్వలేదు. అయితే మైసూర్​ యువరాజు యదువీర్ కృష్ణదత్త ఒడెయార్​ను ఎన్నికల బరిలో నిలిపింది. సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాను కాదని యదువీర్​ను పోటీ చేయించడం వెనుక కమలదళ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలేంటి ఆ వ్యూహం? బీజేపీకి ఏ మేర కలిసివస్తుందో తెలుసుకుందాం.

Mysore King Yaduveer Contest Lok Sabha Election 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 8:29 AM IST

Mysore King Yaduveer Contest Lok Sabha Election 2024 : సార్వత్రిక ఎన్నికల్లో 370కు పైగా సీట్లే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలను రాబట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం విడుదల చేసిన బీజేపీ లోక్​సభ అభ్యర్థుల రెండో జాబితాలో మైసూర్​ యువరాజు యదువీర్ కృష్ణదత్త ఒడెయార్​ను, మైసూర్​-కొడగు స్థానం నుంచి బరిలో దింపింది. సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాను పక్కనపెట్టి యదువీర్​ను రంగంలోకి లోక్​సభ ఎన్నికల పోరులో నిలిపింది. మైసూర్​ రాజవంశానికి ఉన్న ప్రాబల్యాన్ని ఓట్లుగా మార్చుకునేందుకు బీజేపీ లోక్​సభ ఎన్నికల్లో యదువీర్​కు సీటు ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దక్షిణాదిలో బలం పుంజుకునేందుకు!
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో బీజేపీకి కాస్త బలం తక్కువ. అయితే దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. గతేడాది వరకు అధికారంలో ఉన్న కమలదళం అక్కడ బాగానే సీట్లు రాబట్టాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా, 2019 లోక్​సభ ఎన్నికల ఫలితాలని రిపీట్​ చేయాలనుకుంటే మాత్రం మరింత కష్టపడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం జేడీఎస్​తో పొత్తు కుదర్చుకుందని చెబుతున్నారు. మైసూర్ రాజ వంశీకుల ప్రభావం ఆ సమీప ప్రాంతాల్లోని లోక్​సభ సీట్లపైన కూడా ఉంటుందని, అందుకే సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాను కాదని యదువీర్​ను సార్వత్రిక పోరులో బీజేపీ దింపిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజవంశానికి రాజకీయాలు కొత్తేమీకాదు
31 ఏళ్ల యదువీర్ అమెరికాలో చదువుకున్నారు. 2015 మే 28న మైసూర్​ రాజసంస్థానానికి యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. కాగా, మైసూరు రాజకుటుంబానికి రాజకీయాలు కొత్తేమి కాదు. అంతకుముందు మైసూర్ రాజు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయార్ మైసూరు పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరఫున నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. కొన్నాళ్లు బీజేపీలో కూడా ఆయన పనిచేశారు.

20మంది అభ్యర్థులతో జాబితా
సుదీర్ఘ చర్చల అనంతరం రెండో జాబితాలో కర్ణాటకకు చెందిన 20 మంది లోక్​సభ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. పార్టీకి గట్టి పట్టున్న కర్ణాటకలో ఈసారి కమలనాథులు ఒకింత ప్రయోగం చేశారు. ఏకంగా ఎనిమిది మంది సిట్టింగ్‌లకు చోటివ్వలేదు. శ్రీనివాసప్రసాద్‌, డీవీ సదానందగౌడ, ప్రతాప్‌ సింహా, నళిన్‌ కుమార్‌ కటీల్‌, జీఎం సిద్ధేశ్వర, శివకుమార్‌ ఉదాసి, వై దేవేంద్ర, సంగణ్ణ కరాడిని పక్కన పెట్టింది బీజేపీ.

టికెట్ దక్కినవారు
యదువీర్‌ కృష్ణదత్త ఒడెయార్‌ (మైసూరు-కొడగు); మాజీ సీఎం బసవరాజ బొమ్మై (హవేరి); డాక్టర్‌ సి.ఎన్‌.మంజునాథ్‌ (బెంగళూరు గ్రామీణ); అన్నాసాహెబ్‌ జొల్లె (చిక్కోడి), డాక్టర్‌ బసవరాజ్‌ క్యావతర్‌ (కొప్పళ), పి.సి.గద్దిగౌడర్‌ (బాగల్‌కోటె), రమేశ్‌ జిగజిణగి (విజయపుర), భగవంత్‌ ఖూబా (బీదర్‌), గాయత్రి సిద్ధేశ్వర (దావణగెరె), బి.శ్రీరాములు (బళ్లారి), కోటా శ్రీనివాసపూజారి (ఉడుపి- చిక్కమగళూరు), వి.సోమణ్ణ (తుమకూరు), శోభాకరంద్లాజె (బెంగళూరు ఉత్తర), పి.సి.మోహన్‌ (బెంగళూరు క్షేత్ర), ఎస్‌.బాలరాజ్‌ (చామరాజనగర), కెప్టెన్‌ బ్రిజేష్‌ చౌతా (దక్షిణ కన్నడ), ప్రహ్లాద్‌ జోషి (ధార్వాడ్), డాక్టర్‌ ఉమేశ్‌ జాదవ్‌ (కలబురగి), బి.వై.రాఘవేంద్ర (శివమొగ్గ), తేజస్వి సూర్య (బెంగళూరు దక్షిణ)ను బీజేపీ అధిష్ఠానం లోక్​సభ ఎన్నికల బరిలో నిలిపింది.

బీజేపీ 'టార్గెట్ 370'- నలుగురు కేంద్రమంత్రులకు సీట్లు- ఎంపీగా ఖట్టర్ పోటీ

'కాంగ్రెస్​ గెలిస్తే మహిళలకు ఏడాదికి రూ.లక్ష- ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.