ETV Bharat / opinion

ఇంట్రెస్టింగ్​గా 'మహా ఎన్నికలు'- రెండు కూటముల మధ్య కుమ్ములాట- ఎవరిది విజయమో? - Maharashtra Lok Sabha Elections

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 11:47 AM IST

Updated : Apr 3, 2024, 1:31 PM IST

Maharashtra Lok Sabha Elections 2024 : ప్రధాన రాజకీయ పార్టీల్లో చీలికలు, మరాఠా రిజర్వేషన్లు, అస్తిత్వం కోసం పోరాటాలు, కూటమిలో సీట్ల పంపకాల్లో అసంతృప్తులు వంటి అంశాలు మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలను ఆసక్తికరంగా మార్చాయి. ప్రధాని మోదీ మ్యేనియానే ప్రధాన అస్త్రంగా ఎన్డీఏ కూటమి ఎన్నికల రణక్షేత్రంలో దిగగా నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, నమ్మక ద్రోహం వంటి అంశాలతో విపక్షాలు ముందుకు సాగుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్‌ తర్వాత అత్యధిక పార్లమెంట్‌ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో అధిక స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటాలని అన్ని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

Maharashtra Lok Sabha Elections 2024
Maharashtra Lok Sabha Elections 2024

Maharashtra Lok Sabha Elections 2024 : ప్రధాన రాజకీయ పార్టీలైన శివసేన, ఎన్​సీపీలో చీలికలతో మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఉత్తర్‌ప్రదేశ్ తర్వాత లోక్‌సభ స్థానాల పరంగా అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని నాలుగు వందల స్థానాల లక్ష్యాన్ని అందుకోవాలని ఎన్డీఏ ప్రణాళికలు రచిస్తుండగా, మహారాష్ట్రలో సత్తా చాటి తమ బలాన్ని నిరూపించుకోవాలని విపక్ష ఇండియా కూటమి వ్యూహాలు పన్నుతోంది. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలు ఉండగా ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో ఐదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.

2019లో జరిగిన ఎన్నికల్లో 48 స్థానాలకు గాను 41 సీట్లను బీజేపీ-శివసేన కూటమి గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా విఫలమైంది. కానీ తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీ-శివసేన కూటమిలో విభేదాలు పుట్టుకొచ్చి విడిపోయాయి. శివసేనలో ఒక వర్గమైన సీఎం ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని పార్టీ ఎన్డీఏలో ఉండగా ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం విపక్ష ఇండియా కూటమితో కలిసి పనిచేస్తోంది. అలాగే ఎన్​సీపీలోనూ చీలికలు వచ్చాయి. శరద్‌ పవార్‌తో విభేదించిన అజిత్‌ పవార్‌, ఏక్‌నాథ్‌ శిందే మంత్రివర్గంలో చేరారు. ఇప్పుడు అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్​సీపీ ఎన్డీఏవో ఉండగా శరద్‌ పవార్‌ నేతృత్వంలోని పార్టీ విపక్ష ఇండియా కూటమితో ఉంది.

రెండు కూటముల కుమ్ములాట!
భారతీయ జనతా పార్టీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్​సీపీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన భాగస్వాములుగా ఉన్న ఎన్డీఏ 48 ఎంపీ స్థానాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష కాంగ్రెస్ శరద్‌ చంద్ర పవార్‌ ఎన్​సీపీ, ఉద్ధవ్‌ ఠాక్రే నేృత్వంలోని శివసేన భాగస్వాములుగా ఉన్న విపక్ష ఇండియా కూటమి కూడా సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ మహా వికాస్ అఘాడీ విపక్ష ఇండియా కూటమిలో భాగం. మహారాష్ట్రలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటే దిల్లీ పీఠాన్ని అధిరోహించడం తేలిక కావడం వల్ల ఈ రాష్ట్రంపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్​సీపీల్లో చీలికలు ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఛిన్నాభిన్నమైన మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ ఎంత ప్రభావం చూపుతుందన్నది అంచనా వేయడం కూడా కష్ట సాధ్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు దక్కించుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

బీజేపీ సంగతేంటి?
మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మానే ప్రధాన అస్త్రంగా బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రధానిని ట్రంప్‌ కార్డ్‌గా వినియోగించి ఓట్లను రాబట్టాలని వ్యూహం రచించింది. మోదీ ప్రజాదరణ, కేంద్ర సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని కమలం పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్రలో బలమైన నాయకత్వం ఉంది. సంస్థాగతంగా కూడా కమల దళం బలంగా ఉంది. ఈ అంశాలన్నీ బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్ర ఫడణవీస్‌ను ఉప ముఖ్యమంత్రి స్థాయికి తగ్గించడం బీజేపీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. మరో ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌ను తీసుకోవడం కూడా బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలకు తీవ్ర అసంతృప్తిని కలిగించింది. పెరిగిన నిత్యావసర ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలు కూడా కమలం పార్టీపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కానీ బలహీనమైన ప్రతిపక్షం ఉన్న కారణంగా బీజేపీ ఎక్కువ ఎంపీ స్థానాలే లక్ష్యంగా సాగుతోంది.

పూర్వ వైభవం కోసం కాంగ్రెస్‌ పాకులాట!
మహారాష్ట్రలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్‌ పార్టీ పాకులాడుతోంది. కాంగ్రెస్‌ శ్రేణులు నిస్తేజంతో ఉన్నా ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. కూటమిలో మిగిలిన పార్టీలను కలుపుకుని ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. కానీ మహారాష్ట్రలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేకపోవడం కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. ఎన్​సీపీ, శివసేనలో చీలికలు కూడా కూటమిలోని కాంగ్రెస్‌ను నష్టపరిచాయి. అంతర్గతంగా ఐక్యత లేకపోవడం కూడా కాంగ్రెస్‌ పార్టీకి మరింత నష్టాన్ని చేకూరుస్తోంది.

శరద్‌ పవార్‌తో విడిపోయి ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వంలో భాగస్వామి అయిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్ నేతృత్వంలోని ఎన్​సీపీకి ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. అజిత్‌ పవార్‌ కష్టపడి పనిచేసే నాయకుడిగా పాలనా నైపుణ్యాలు కలిగిన అట్టడుగు స్థాయి రాజకీయవేత్తగా పేరు పొందారు. అజిత్‌ పవార్‌ 2023లో తన మామ, ఎన్​సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌తో విడిపోయారు. అజిత్ పవార్ తన రాజకీయ అరంగేట్రం నుంచి శరద్‌ పవార్‌ నీడలోనే ఉండడం ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు శరద్‌ పవార్‌ నీడ నుంచి బయటపడి సొంతంగా బరిలో నిలుస్తున్న అజిత్‌ పవార్‌ ఏ మేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది.

తొలిసారి వదిన-మరదళ్ల పోటీ!
2024 చివర్లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్​సీపీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో అజిత్ పవార్ సత్తా చాటితే తన మామ శరద్‌ పవార్‌ నీడ నుంచి బయటకు వచ్చి బలం నిరూపించుకున్నారని అందరూ భావించే అవకాశం ఉంది. ఈసారి బారామతి లోక్‌సభ స్థానం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీ పడుతున్నారు. ఈ ముఖాముఖి పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ ఎన్నికల ప్రచారంలో అజిత్‌ పవార్‌కు శరద్‌ పవార్‌ ఆశీస్సులు ఉన్నాయా లేదా అన్న మీమాంసకు కూడా సమాధానం దొరికే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. బారామతి పోరు ఎన్​సీపీలోని రెండు వర్గాలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఒకవేళ ఈ పోరులో అజిత్ పవార్ ఓడిపోతే భారతీయ జనతా పార్టీ వద్ద అజిత్‌ పవార్‌ పలుకుబడి తగ్గిపోయే అవకాశం ఉంది.

శరద్‌ పవార్‌ లేని మహారాష్ట్ర రాజకీయాలను ఊహించడం కష్ట సాధ్యం. రాజకీయ కురు వృద్ధుడిగా శరద్‌ పవార్‌ మరాఠ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎన్నో ఆటుపోట్లను అధిగమించిన శరద్‌ పవార్‌ ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. చీలికతో అస్తవ్యస్తంగా మారిన ఎన్​సీపీని మరోసారి గాడిన పెట్టేందుకు ఈ ఎన్నికలనే అవకాశంగా మలుచుకోవాలని శరద్‌ పవార్‌ పట్టుదలతో ఉన్నారు. శరద్‌ చంద్ర పవార్‌ ఎన్​సీపీకి అతి పెద్ద బలం శరద్‌ పవారే. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజాదరణ, పరిపాలన అనుభవం ఉన్న శరద్‌ పవార్‌ ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటి తన మార్క్‌ రాజకీయాన్ని చాటిచెప్పాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

శరద్‌ పవార్​ బలాలు!
1999లో ఎన్​సీపీని స్థాపించిన శరద్‌ పవార్‌ సీంగా, కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. 83 ఏళ్ల వయసులోనూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటుండడం ఆ పార్టీకి కలిసిరానుంది. పార్టీలో చీలిక వచ్చినప్పటికీ శరద్‌ పవార్‌ తన వర్గంలోని ఎందరో అనుచరులకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ తన రాజకీయ చతురతతో ప్రత్యర్థులకు చెక్‌ చెప్పగల నాయకుడు శరద్‌ పవార్‌. ఈ అంశాలన్నీ శరద్‌ పవార్‌ ఎన్​సీపీకి కలిసిరానున్నాయి.

సినీ నటుడు అమోల్ కోల్హే వంటి కొత్త నాయకుల ఆవిర్భావం కూడా శరద్‌ పవార్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ చీలిపోయిన ఎన్​సీపీని పునర్నిర్మించడం పవార్‌కు పెద్ద సవాల్‌గా మారింది. శరద్ పవార్ రాజకీయ వారసురాలిగా భావించే సుప్రీయా సూలే ఆశించినంత మేర విజయవంతం కాలేకపోయారు. ప్రత్యర్థులను దూకుడుగా ఎదుర్కోవడంలో సుప్రియా సూలే విఫలమవుతున్నారు. 1999 నుంచి ఎన్​సీపీ ఓట్ల శాతం 15 నుంచి 16 శాతం మధ్య నిలిచిపోయింది. 25 ఏళ్లు దాటినా ఓట్ల శాతం మాత్రం పెరగలేదు.

పక్కా ప్లాన్​తో ఏక్​నాథ్​ శిందే ముందుకు!
శివసేన కూడా చీలిక తర్వాత తొలిసారి ఈ ఎన్నికలను ఎదుర్కోబోతోంది. రెండు శివసేన గ్రూపులకు సైద్ధాంతిక రాజకీయ గుర్తింపు స్పష్టంగా లేదు. ఇది ఈ రెండు వర్గాలకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన ఈ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటి అసలైన శివసేన తమదేనని మహారాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీ వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే వారసత్వాన్ని పొందేందుకు ఏక్‌నాథ్‌ శిందే ప్రయత్నిస్తున్నారు. తన తిరుగుబాటు స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, సుదీర్ఘ కాలం పాటు మరాఠాలకు అండగా ఉంటానని చెప్పేందుకు ఈ ఎన్నికలు ఉపయోగించుకోవాలని శిందే భావిస్తున్నారు. బాల్ ఠాక్రే స్థాపించిన సంస్థాగత శివసేన నిర్మాణం ఏక్‌నాథ్‌ శిందేకు కలిసిరానుంది.

మరోవైపు ఉద్దవ్‌ ఠాక్రే కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటి అసలైన శివసేన తమదేనని చాటాలని పట్టుదలతో ఉన్నారు. శిందే, ఆయన వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటు పట్ల అసంతృప్తిగా ఉన్న ఓటర్ల నుంచి ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి సానుభూతి వచ్చే అవకాశం ఉంది. ఉద్ధవ్ ఠాక్రేకు తన నాయకత్వ నైపుణ్యాన్ని ప్రదర్శించి కోల్పోయిన స్థానాలను తిరిగి గెలిచేందుకు ఇదే సరైన సమయమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. శిందేతో అసంతృప్తిగా ఉన్న శివసైనికులను ఆకర్షించడానికి ఉద్దవ్‌కు 2024 లోక్​సభ ఎన్నికలు సువర్ణావకాశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాజకీయాలపై ఈ ముగ్గురు నేతల భార్యల ఫోకస్​- సీఎం పీఠంపైనే గురి! - party president wives on politics

LDF x UDF x NDA- జాతీయ సమస్యలే ప్రధాన ఎజెండా- కేరళలో హోరాహోరీ పోరు తప్పదు! - Lok Sabha Election 2024 Kerala

Last Updated : Apr 3, 2024, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.