Job Calendar Creates New Hopes in Unemployed : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కారు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించింది. ఉద్యోగ ప్రకటనలు, పరీక్షలపై స్పష్టమైన కాలపరిమితితో కూడిన షెడ్యూల్ వెల్లడించారు. గ్రూప్-1,2,3 సర్వీసులు పోలీస్, సింగరేణి, గురుకుల, వైద్య విభాగాల ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఇందులో ఉన్నాయి. యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ తరహాలో ఈ క్యాలెండర్‌ను ప్రభుత్వం రూపొందించింది. భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య, ఇతర వివరాలను ఉద్యోగ ప్రకటనలో వెల్లడించనుంది.
గ్రూప్-4ను గ్రూప్-3తో కలిపి జరుపుతామని చెప్పింది. గ్రూప్-2 ప్రకటన 2025 మే నెలలో, గ్రూప్-3 నోటిఫికేషన్ జులైలో వెలువడనున్నాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఎలాంటి భరోసా కల్పిస్తోంది? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి? ఏఏ అంశాలపై దృష్టి సారించాలి? ఇదే నేటి ప్రతిధ్వని.