Pratidhwani : గుడికి వెళితే అదో ప్రశాంతత! దేవుడికి మనసారా నమస్కరించుకుంటే అదో భరోసా! ఆ తీర్థ ప్రసాదాలు తీసుకుని కాసేపు కూర్చుంటే చెప్పలేని సంతృప్తి! కోట్లమందిని ఆలయాల వైపు నడిపించే ఆధ్యాత్మిక భావనలు ఇవే. కొంతకాలంగా వీటి స్థానంలో వెంటాడుతున్న వివాదాలు భక్తి భావనలకే తీరని బాధ కలిగిస్తున్నాయి. ఆలయాల్లో అపచారాలు, పాలక మండళ్ల నియామకాలు, వారి నిర్వాకాలు వింటుంటే గుండెల్లో కలుక్కుమంటోంది. ఇవన్నీ ఒకెత్తయితే మరీ ముఖ్యంగా అయిదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో 100కు పైగా ఆలయాలపై జరిగిన దాడులు మరొక ఎత్తు. ఆలయాల ఆస్తులు, భూముల అన్యాక్రాంతం, నిధుల మళ్లింపు ఇలా మరెన్నో. ప్రస్తుతం చూస్తున్న తిరుమల లడ్డూ వివాదం సరేసరి. ఈ నేపథ‌్యంలో ప్రభుత్వాలు, పాలకులు మారిన తరుణంలో అయినా ఆలయ వ్యవస్థలో రావాల్సిన మార్పులు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, సామాన్య భక్తుల సైతం స్పందించారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ఆలయంలో రోజుకు సుమారు 3.5 లక్షల లడ్డూలను సిబ్బంది తయారు చేస్తారు. ఇందుకు 14 టన్నుల నెయ్యిని వినియోగిస్తారు. ఈ సందర్భంలోనే తిరుమలలో 82,100 కిలోల సామర్థ్యంతో మూడు నెయ్యి యూనిట్లును ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన మేరకు లడ్డూలు సరఫరా చేయాల్సిన నేపథ్యంలో 40 థర్మోఫ్లూయిడ్ స్టవ్‌లతో బూందీపోటును ఏర్పాటు చేశారు.
గతంలో లడ్డూను తయారు చేసేందుకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాసిరకం నెయ్యి వినియోగించడాన్ని తొలుత బూందీపోటులో పనిచేసే సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని అనేక సార్లు డిప్యూటీ, ఈవో సూపరింటెండెంట్ల దృష్టికి తీసుకువెళ్లారు. అయిన ఎలాంటి ప్రయోజనం లేదు. సాధారణంగా బూందీ, నెయ్యి కలిపే సమయంలో సువాసన వస్తుంది. పుర వీధుల్లో తిరుగుతున్న భక్తులు ఈ సువాసనను ఆస్వాదించేవారు. నాసిరకం నెయ్యి వినియోగించినప్పటి నుంచి లడ్డూ తయారు చేసేటప్పుడే కనీసం సువాసన వచ్చేది కాదని కొంత మంది పోటు సిబ్బంది వెల్లడించారు.
'గోవు ఘోష విను గోవిందా' పేరిట బీజేపీ వినూత్న నిరసనలు - BJP Kisan Morcha Fire on YSRCP