ETV Bharat / opinion

దెబ్బతింటున్న చిన్నమదుపర్ల "ఫ్యూచర్" - మూడేళ్లలో 93శాతం మందికి నష్టాలే! - Risk Less Returns in Shares - RISK LESS RETURNS IN SHARES

Prathidwani : ఫ్యూచర్స్​ అండ్​ ఆప్షన్స్​ విభాగంలో ట్రేడింగ్​ చేసే వారిలో 91 శాతం మంది చిన్న మదుపర్లు నష్టాలను చవిచూసినట్లు సెబీ తాజా అధ్యయనంలో వెల్లడైంది. సగటున ఒక్కొక్కరు నికరంగా రూ. 1.2 లక్షలు నష్టపోయినట్లు తెలిపింది. 2021-22 నుంచి 2023-24 వరకు చూస్తే 93 శాతం మందికి పైగా చిన్న మదుపర్లు ఎఫ్​అండ్​ఓ ట్రేడింగ్​లో డబ్బులు పోగొట్టుకున్నారు.

RISK LESS RETURNS IN SHARES
ఎఫ్‌ అండ్‌ ఓలో చితికిపోతున్న చిన్నమదుపర్లు - మూడేళ్ల సగటున నష్టపోయిన వారు ఎంతమంటే? (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2024, 1:38 PM IST

Prathidwani : తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందొచ్చు. అందుకు ఒక మంచిమార్గం ఫ్యూచర్ అండ్ ఆప్షన్లు. ఆ ఆశే ఇప్పుడు ముంచేస్తోంది. ఎఫ్​అండ్​ఓ విభాగంలో లక్షల సంఖ్యలో పెరుగుతున్న రిటైల్ మదుపర్లు ఊహించని రీతిలో చితికి పోతున్నారు. మూడేళ్లలో వారు నష్ట పోయిన మొత్తం అక్షరాల 1.8 లక్షల కోట్ల రూపాయలు. 2023-24లోనే హరించుకుపోయిన చిన్నమదుపర్ల డబ్బులు 75వేల కోట్ల రూపాయలు. ఇందులోనూ 30ఏళ్ల లోపు వారే అధికం అంటోంది సెబీ. కానీ ఎందుకీ పరిస్థితి? ఎఫ్​అండ్​ఓ లతో పాటు మొత్తం స్టాక్‌మార్కెట్‌లో చిన్న ఇన్వెస్టర్లు ఎంతవరకు సేఫ్? స్టాక్స్‌లో మదుపు చేయడానికి ముందు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలేంటి? రిస్క్ లేని రిటర్న్స్ కోసం నిపుణులు ఏం సూచిస్తున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ వీవీకే ప్రసాద్, వెల్త్ ట్రీ గ్రూప్ ఫౌండర్‌ సీఈవో దాసరి ప్రసాద్ పాల్గొన్నారు.

ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ విభాగంలో ట్రేడింగ్‌ (F&O Trading) చేసిన వారు పెద్ద సంఖ్యలో నష్టపోతున్నారని తెలిసినా పెట్టుబడులు మాత్రం ఆగడం లేదు. తక్కువ సమయంలో లాభాలను పొందొచ్చనే ఆశతో ఈ ట్రేడింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఈ విభాగంలో పెట్టుబడులు పెట్టిన వారిలో 91 శాతం మంది అంటే సుమారు 73 లక్షల మంది వ్యక్తిగత పెట్టుబడిదారులు నష్టాలు చవిచూసినట్లు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) తెలిపింది. అంటే ప్రతి 10 మందిలో 9 మందికి నష్టాలు ఎదురవుతున్నట్లు తన అధ్యయనంలో వెల్లడించింది. వీరు సగటున రూ.1.2 లక్షలు చొప్పున నష్టం ఎదుర్కొన్నట్లు తెలిపింది.

రూ.25,000 కోట్ల హ్యుందాయ్‌ IPOకు సెబీ అనుమతి - ఈ మెగా ఇష్యూ డేట్ ఎప్పుడంటే? - Hyundai Motor India IPO

గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల లెక్క తీసినప్పుడు ఈ సంఖ్య 93 శాతం పైమాటేనని సెబీ పేర్కొంది. సుమారు కోటి మంది ట్రేడర్లు సగటున రూ.2 లక్షల వరకు (లావాదేవీ మొత్తం కలుపుకొని) నష్టపోయినట్లు తెలిపింది. మూడేళ్ల కాలంలో సుమారు రూ.1.8 లక్షల కోట్లు నష్టపోయినట్లు వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.75 వేల కోట్లుగా ఉంది. నష్టపోయిన వారిలో మొదటి 3.5 శాతం మంది అంటే సుమారు 4 లక్షల మంది ట్రేడర్లు సగటున రూ.28 లక్షలు చొప్పున నష్టపోయినట్లు సెబీ గణాంకాలు చెబుతున్నాయి.

IPOలకు అప్లై చేస్తున్నారా? ఈ స్కామ్​ గురించి తెలుసుకోండి - లేకుంటే ఇక అంతే! - SME IPO Scams

'2024లో భారత్​ వృద్ధి రేటు 6.8%' - S&P రేటింగ్స్ అంచనా!​ - India Growth Forecast

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.