- " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Pratidhwani : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూడటం కోసం ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఐపీఎస్, ఐఏఎస్‌లు మరికొందరిపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేసింది. చాలాకాలంగా వీరిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ అధికారి అయుండి తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు స్వయంగా తన కంప్యూటర్‌లో నుంచే దొంగ ఓట్లు నమోదు చేయించిన పాపానికి జిల్లా కలెక్టర్ గిరీషపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. అయినా జగన్ భక్త అధికారుల తీరులో మార్పు రాలేదు. ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ అధికారపార్టీకి ఊడిగం చేస్తే ఉద్యోగాలు ఊడతాయనే భయం ఇంకా కొద్దిమందికి రావాలి. బదిలీ వేటుతో అయినా జగన్ భక్త అధికారుల్లో మార్పు వస్తుందా? "జగన్ భక్త అధికారులకు చెంపపెట్టు - ఊడిగం చేస్తే ఉద్యోగాలు ఊడతాయ్" అనే అంశంపై ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ, రాజకీయ విశ్లేషకులు కె.గౌతమ్ పాల్గొన్నారు.
Election Commission Transferred IAS and IPS Officers : ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అంశంపై కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. మొత్తం ఆరుగురు ఐపీఎస్‌లు, ముగ్గురు ఐఏఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అటు ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి కూడా వేటు వేస్తూ ఆదేశాలిచ్చింది.
ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ పి. జాషువా, అనంతపురం ఎస్పీ కేకే అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ కె. తిరుమలేశ్వర్పై బదిలీ వేటు వేసింది. అటు సీనియర్ ఐపీఎస్ అధికారి, గుంటూరు రేంజ్ ఐజీ జి. పాలరాజును కూడా బదిలీ చేసింది.
ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవహారంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న మూడు జిల్లాల కలెక్టర్లపై వేటు వేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి, తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషాలపై వేటు వేశారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అత్యవసర నోట్‌ను ఎన్నికల సంఘం పంపింది. వేటు వేసిన అధికారులంతా తమ బాధ్యతల్ని దిగువ స్థాయి అధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరోవైపు బదిలీ అయిన జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల నియామకానికి ముగ్గురు చొప్పున పేర్లను కమిషన్‌కు పంపాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.