CEC Cap on MP Candidates Expenditure Limit : లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులపై సీఈసీ పరిమితి విధించింది. అభ్యర్థి తన నియోజకవర్గంలో రూ.95 లక్షలకు మించి ఖర్చు చేయరాదంటూ స్పష్టం చేసింది. ధనబలం, రౌడీయిజంలను సంహించబోమనీ, తప్పుడు సమాచారం వ్యాప్తిచేస్తే కొరఢా ఝుళిపిస్తామనీ హెచ్చరించింది. అయితే ఎలక్టోరల్ బాండ్లతో వేలకోట్ల ధనం సేకరిస్తున్న రాజకీయపార్టీలు ఎన్నికల్లో డబ్బును యథేచ్ఛగా ఖర్చుచేస్తున్నాయి. ఎన్నికల వేళ బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల్లో రూ.లక్షకు మించి జమ, విత్ డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్‌లైన్ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని సూచించింది. ఈ విపరీత పరిస్థితుల్లో ఎన్నికల సంఘం హెచ్చరికలు ఎంత మేరకు ప్రభావం చూపుతాయి?ఎన్నికల సభల్లో తప్పుడు ప్రచారాలు, విద్వేష ప్రసంగాలు చేస్తున్న నేతలపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసీ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? దేశవ్యాప్తంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలంటే వ్యవస్థల్లో రావాల్సన మార్పులేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.