ETV Bharat / offbeat

ఈ ఆయుర్వేదిక్ మిశ్రమాన్ని రోజూ ఒక్క స్పూన్​ తింటే చాలు - మెరిసే అందం మీ సొంతం! - Home Remedy for Healthy Skin

Home Remedy for Healthy Skin : ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలని ఉంటుంది. అందుకోసం రోజూ రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడుతుంటారు. అయినా.. ఫలితం అంతంతమాత్రమే ఉంటుంది. మీరు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉంటే.. ఈ ఆయుర్వేద మిశ్రమాన్ని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

Healthy Skin Ayurvedic Home Remedy
Home Remedy for Healthy Skin (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 12:02 PM IST

Healthy Skin Ayurvedic Home Remedy : అందంగా కనిపించేందుకు చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఎన్ని సౌందర్య ఉత్పత్తులు యూజ్ చేసినా ఫలితం కొద్దిసేపటి వరకే ఉంటుంది! అలా కాకుండా.. మీరు డైలీ ఈ ఆయుర్వేదిక్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకున్నారంటే చాలు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంతోపాటు మెరిసే అందాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవీ.

ఇందుకోసం ఎక్కువగా శ్రమించాల్సిన పనిలేదు.. ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. చాలా సింపుల్​గా వంటింట్లో లభించే మూడే మూడు పదార్థాలతో చర్మాన్ని(Skin) మెరిపించే బెస్ట్ హోమ్ రెమిడీని సిద్ధం చేసుకోవచ్చంటున్నారు. ఇంతకీ, ఆ హోమ్ రెమిడీకి కావాల్సిన పదార్థాలేంటి? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఏవిధంగా తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • గట్టి పెరుగు - 250 గ్రాములు
  • పంచదార - 100 గ్రాములు
  • యాలకుల పొడి - పావుచెంచా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా గట్టి పెరుగు తీసుకోవాలి. ఆపై దాన్ని ఒక క్లాత్​లో వేసి అందులో వాటర్ పోయేంత వరకు గట్టిగా పిండాలి.
  • అవసరమైతే గట్టిగా పిండి మూటగట్టి దానిపై ఒక బరువు పెట్టి రెండు నుంచి మూడు గంటల పాటు ఉంచితే అందులోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. పెరుగులో ఉండే ఘన పదార్థం మాత్రమే తీసుకోవాలి.
  • ఆ తర్వాత పెరుగు ముద్దను ఒక బౌల్​లోకి తీసుకొని అందులో చక్కెరను పొడి చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే యాలకుల పొడి కూడా వేసుకొని ఆ మిశ్రమం మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే.. అది మెత్తని పేస్ట్ మాదిరిగా మారే వరకు కలుపుకోవాలి.
  • ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక.. పిండి పట్టుకునే జల్లెడపై పెరుగు ముద్దని వేసి చెంచాతో రుద్దుకోవాలి.
  • దీనివల్ల ఏవైనా మలినాలు ఉంటే జల్లెడలో మిగిలిపోతాయి.
  • ఇప్పుడు జల్లెడ పట్టుకున్న మంచి మిశ్రమాన్ని బౌల్​లోకి తీసుకుంటే సరిపోతుంది.
  • అంతే.. చర్మ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడే బెస్ట్ ఆయుర్వేదిక్ హోమ్ రెమిడీ సిద్ధం!
  • దీన్ని తినడం వల్ల చర్మం ఎంతగానో మెరిసిపోతుందని డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు.

దీన్ని ఎలా తీసుకోవాలంటే?

పెరుగుతో ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయుర్వేదిక్ హోమ్ రెమిడీని రోజూ ఉదయం, సాయంత్రం ఒక పెద్ద చెంచా పరిమాణంలో రెగ్యులర్​గా తీసుకుంటున్నట్లయితే చాలా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు డాక్టర్ గాయత్రీ దేవీ. ముఖ్యంగా చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతగానో సహాయపడుతుందంటున్నారు. డైలీ తీసుకోవడం ద్వారా స్కిన్​ని ఆరోగ్యంగా ఉంచుకోవడమే కాకుండా.. బేబీ స్కిన్​లా మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు.

ఇవీ చదవండి :

సూపర్ సీక్రెట్ : రైస్ వాటర్​ వృథాగా పారబోస్తున్నారా? - ఇలా చేస్తే మీ ముఖం తళతళా మెరిసిపోతుంది!

ఫేస్ నిండా మొటిమలా? - చేప మందుతో మొత్తం క్లియర్! - చక్కటి రూపం మీ సొంతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.