ETV Bharat / offbeat

సేమియాతో ఎప్పుడూ రొటీన్​వే ఎందుకు? - ఈసారి 'నవాబి సేమియా' ట్రై చేయండి - తిన్నారంటే వారెవ్వా అనడం పక్కా!

సేమియాతో మీరు ఇప్పటి వరకు ట్రై చేయని అద్దిరిపోయే రెసిపీ - సింపుల్​గా ఇలా ప్రిపేర్ చేసుకోండి!

HOW TO MAKE NAWABI SEMAI
Nawabi Semai Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

How to Make Nawabi Semai Recipe : మీరు ఇప్పటి వరకు సేమియాతో పాయసం, ఉప్మా, పులిహోర వంటి వివిధ రెసిపీలు ట్రై చేసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా నవాబుల కాలం నాటి కస్టర్డ్ సేమియా రెసిపీని ప్రయత్నించారా? లేదంటే మాత్రం ఈ దీపావళి వేళ ఓసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు! మరి, దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • సన్నని సేమియా - 200 గ్రాములు
  • బాదం - 9
  • జీడిపప్పు పలుకులు - 9
  • యాలకులు - 4
  • పంచదార - 2 టేబుల్ స్పూన్లు
  • నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

కస్టర్డ్ తయారీ కోసం :

  • పాలు - అరలీటర్
  • కార్న్ ఫ్లోర్ లేదా కస్టర్డ్ పౌడర్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్
  • చక్కెర - పావు కప్పు
  • సన్నగా తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ - కొన్ని

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా పాయసానికి వాడే సేమియాను కాకుండా సన్నగా పొడవుగా ఉండే దాన్ని ఎంచుకోవాలి. ఆపై ఆ సేమియాను ఒక బౌల్​లోకి తీసుకొని చేతితో తినడానికి వీలుగా స్మాల్​ పీసెస్​గా బాగా క్రష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​ తీసుకొని అందులో బాదం, జీడిపప్పు పలుకులు, యాలకులు వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
  • తర్వాత అందులో నుంచి సగం బాదం, జీడిపప్పు పొడిని ఒక చిన్న బౌల్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్​లో ఉన్న మిగతా సగం పొడిలో పంచదార యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక అందులో ముందుగా క్రష్ చేసుకొని పెట్టుకున్న సేమియాను వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి.
  • ఆవిధంగా ఫ్రై చేసుకున్నాక అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న చక్కెర పొడి మిశ్రమాన్ని వేసుకొని మరో 3 నుంచి 4 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా చక్కెర పొడి అంతా బాగా కరిగిపోయి సేమియాకు చక్కగా పడుతుంది.
  • అలా ఫ్రై చేసుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని ఆ సేమియా మిశ్రమాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • తర్వాత దాన్ని రెండు సమాన భాగాలుగా సెపరేట్ చేసుకోవాలి. ఆపై మీరు ఏ బౌల్​లో అయితే స్వీట్​ను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అందుకోసం రెండు బౌల్స్ తీసుకోవాలి.
  • తర్వాత ఒక భాగం సేమియా మిశ్రమాన్ని ఆ రెండు బౌల్స్​లో ఈక్వల్​గా తీసుకొని ఒక చిన్న గిన్నెతో పైభాగం సమానంగా ఉండేలా వత్తుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం రెసిపీలోకి కావాల్సిన కస్టర్డ్​ను ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో అర కప్పు పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని మిగతా పాలను పోసుకొని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు బౌల్​లో తీసుకున్న పాలలో కార్న్ ఫ్లోర్ లేదా కస్టర్డ్ పౌడర్, ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకున్న సగం జీడిపప్పు బాదం పొడి వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • పాలు మరిగి కొంచం చిక్కగా మారాయనుకున్నాక.. మీరు మిక్స్ చేసుకొని పెట్టుకున్న పాల మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై మీడియం ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • అప్పుడు మిశ్రమం చిక్కగా, క్రీమీగా వస్తుంది. ఆవిధంగా మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నాక చక్కెర యాడ్ చేసుకొని మరో 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆపై దింపుకొని తరుకున్న డ్రైఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటే కస్టర్డ్ రెడీ అయిపోతుంది.
  • ఇక ఇప్పుడు మీరు రెండు బౌల్స్​లో సమానంగా వత్తుకొని పెట్టుకున్న సేమియా మిశ్రమంలో కస్టర్డ్​ను రెండు సమాన భాగాలుగా పోసుకోవాలి. ఆపై పక్కకు తీసుకొని పెట్టుకున్న మరో భాగం సేమియా మిశ్రమాన్ని వాటిపై ఈక్వల్​గా వేసి సమానంగా అప్లై చేసుకోవాలి.
  • ఇక చివరగా దానిపై కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ స్వీట్​ని డైరెక్ట్​గా తినడం కంటే రెండు మూడు గంటలపాటు ఫ్రిజ్​లో ఉంచి ఆపై సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "నవాబి కస్టర్డ్ సేమియా" రెసిపీ రెడీ!

ఇవీ చదవండి :

ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలు- ఎంతో రుచికరమైన "పాలకోవా" ఈజీగా చేసుకోవచ్చు!

నోట్లో వేస్తే కరిగిపోయే "కమ్మని కలాకండ్​" - ఇలా చేస్తే అచ్చం స్వీట్​ షాప్​ టేస్ట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.