IRCTC Ultimate Ooty Tour Package: ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ ఊటీ. పచ్చని ప్రకృతిలో.. అందమైన సరస్సుల పక్కనుంచి.. ఎత్తైన కొండల మధ్య ప్రయాణం చేస్తే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మరి అలాంటి ఫీల్‌ను మీరూ పొందాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్ చెబుతోంది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). ఊటీ అందాలను చూసేందుకు ఓ ప్యాకేజీని అందిస్తోంది. మరి ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? ప్రయాణం ఎలా ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
"అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్(ULTIMATE OOTY EX HYDERABAD)" పేరిట ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా టూర్ ఉంటుంది. ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి ట్రైన్ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రైలు ప్రయాణిస్తుంది. గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి రైల్వేస్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. టూర్ పూర్తయ్యాక మళ్లీ ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ఈ టూర్ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్లు కొనసాగుతుంది. కూనూర్, ఊటీలోని పలు ప్రదేశాలు విజిట్ చేయవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటిరోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17230) బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి ఐఆర్సీటీసీ సిబ్బంది తీసుకెళ్తారు. ముందుగానే బుక్ చేసిన హోటల్లో చెకిన్ చేయాలి. సాయంత్రం బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ అందాలు వీక్షించొచ్చు. రెండో రోజు రాత్రి ఊటీలో హోటల్లోనే బస ఉంటుంది.
- మూడో రోజు ఉదయం హోటల్లోనే బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ఆ తర్వాత దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా జలపాతాన్ని వీక్షించడంతో ఆ రోజు పర్యటన పూర్తవుతుంది. రాత్రి మళ్లీ ఊటీలోనే స్టే చేయాలి.
- నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం కూనూర్ పర్యటనకు తీసుకెళ్తారు. అక్కడ పలు ప్రదేశాలు సందర్శించిన తర్వాత తిరిగి ఊటీకి చేరుతారు. రాత్రి మళ్లీ హోటల్లో బస ఉంటుంది.
- ఐదో రోజు అదే హోటల్లో టిఫెన్ చేశాక ఊటీ నుంచి కోయంబత్తూర్ పయనమవుతారు. సాయంత్రం 03:55 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం:17229) ఎక్కాలి. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
- ఆరో రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ పూర్తవతుంది.
ధర వివరాలు:
కంఫర్ట్ (థర్డ్ ఏసీ బెర్త్): ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్‌కు రూ.33,390, ట్విన్ షేరింగ్‌కు రూ.18,660, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14,990 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.9,470, విత్ అవుట్ బెడ్ అయితే రూ.9,220 చెల్లించాలి.
స్టాండర్డ్ (స్లీపర్ బెర్త్): సింగిల్ షేరింగ్‌కు రూ.30,930, ట్విన్ షేరింగ్‌కు రూ.16,210, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.12,530. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.7,020, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,770 చెల్లించాలి. గ్రూప్ బుకింగ్‌పై కొంత మేర తగ్గుతుంది.
ప్యాకేజీలో ఉండేవి ఇవే:
- ట్రైన్ టికెట్లు
- ప్యాకేజీని బట్టి ట్రాన్స్పోర్ట్ కోసం బస్సు సౌకర్యం
- నాన్ ఏసీ అకామిడేషన్ విత్ బ్రేక్‌ఫాస్ట్
- ట్రావెల్ ఇన్సూరెన్స్
- ప్రస్తుతం ఈ టూర్ అక్టోబర్ 15, అక్టోబర్ 22, నవంబర్ 12వ తేదీల్లో అందుబాటులో ఉంది.
- ఈ టూర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
IRCTC సూపర్ ప్యాకేజీ - మీనాక్షి అమ్మన్ ఆలయంతోపాటు ఈ ప్రదేశాలు చూడొచ్చు! - ధర కూడా అందుబాటులోనే!
హైదరాబాద్ to అండమాన్ - ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ - ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరొచ్చు!