ETV Bharat / offbeat

రెండు గంటల్లోనే అయోధ్యకు- హైదరాబాద్ నుంచి విమాన సర్వీస్ ప్రారంభం- టికెట్ ధర ఎంతంటే? - Hyderabad to Ayodhya Direct Flight

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Hyderabad to Ayodhya Flight Cost: హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. ఇకపై అనేక గంటలు సుదీర్ఘ ప్రయాణం చేయకుండా.. కేవలం రెండు గంటల్లోనే అయోధ్యకు చేరుకోవచ్చు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు.. కొత్త విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Hyderabad to Ayodhya Flight Cost
Hyderabad to Ayodhya Flight Cost (ETV Bharat)

Hyderabad to Ayodhya Flight Cost: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మస్థలం ఉత్తర్​ప్రదేశ్ అయోధ్యలో అనేక దశబ్దాల తర్వాత భవ్య రామ మందిరం పూర్తి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. కేవలం భారత్​ నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజల కోరిక మేరకు హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించింది. ఫలితంగా కేవలం రెండు గంటల్లోనే అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 27న హైదరాబాద్- అయోధ్య సర్వీస్ ప్రారంభం కాగా.. వారంలో నాలుగు రోజుల పాటు విమానాలు నడవనున్నాయి. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఈ విమానం రాకపోకలు సాగించనుంది. మధ్యాహ్నం 01:55 గంటలకు హైదరాబాద్​లో బయలుదేరగా.. 04:05 గంటలకు అయోధ్య చేరుకోనుంది. మళ్లీ తిరిగి సాయంత్రం 04:40 గంటలకు అయోధ్యలో బయలుదేరగా.. 06:40కు చేరుకోనుంది. కాగా.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే విమాన ధర సుమారు రూ. 5 వేలపైన ఉంది.

అయోధ్యతో పాటు ఆగ్రా, కాన్పూర్, ప్రయాగరాజ్, రాజ్​కోట్, ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులు ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి అగర్తాల, జమ్మూకు విమాన సర్వీసులు కొనసాగుతుండగా.. మరికొన్ని కొత్త సర్వీసులను కూడా మొదలుపెట్టింది. హైదరాబాద్ నుంచి రాజ్​కోట్​కు ప్రతిరోజు సర్వీసు నడుస్తుండగా.. ప్రయాగరాజ్, ఆగ్రాకు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉండనున్నాయి. మిగిలిన ప్రాంతాలకు వారానికి 4 రోజుల పాటు సేవలందించే విమాన సర్వీసులను విమానయాన శాఖ ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ విమాన సర్వీసులను వినియోగించుకోవాలని కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది. ఇక హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్‌కు రూ. 5,635 పైన ఉండగా.. హైదరాబాద్ నుంచి కాన్పూర్ వెళ్లేందుకు టికెట్ ధర రూ. 4,598పైన ఉంది.

హైదరాబాద్ నుంచి ఇలా ఒక్క నెలలోనే 7 నూతన సర్వీసులను ప్రారంభించడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నూతన సర్వీసులు ఆయా నగరాల మధ్య ప్రయాణికుల డిమాండ్‌ను నెరవేరుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం అందిస్తోన్న ఈ సేవలను సద్వినియోగం చేసుకుని.. ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవాలని సూచించారు.

సింగపూర్​ వెళ్తారా? - తక్కువ ధరలోనే IRCTC సూపర్​ ప్యాకేజీ - మలేసియా కూడా చుట్టేయొచ్చు! - IRCTC Malaysia and Singapore Tour

IRCTC నార్త్ ఇండియా టూర్​ - మాతా వైష్ణోదేవి ఆలయంతోపాటు మరెన్నో ప్రదేశాలు చూడొచ్చు! - Mata Vaishno Devi With Haridwar

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.