ETV Bharat / offbeat

పెరుగు మిగిలినప్పుడు పుల్లగా అయిందని పడేస్తున్నారా? - కానీ, ఇలా అద్భుతంగా వాడొచ్చని మీకు తెలుసా? - How To Use Leftover Curd

Leftover Curd Usage Tips : చాలా మంది ఇళ్లలో కొన్నిసార్లు కూరల్లాగే పెరుగు మిగిలిపోతుంది. దాన్ని తెల్లారి తిందామంటే పుల్లగా అయిందని బయటపడేస్తుంటారు. మీరూ అలాగే చేస్తున్నారా? అయితే, ఒక్కసారి ఆగండి. మిగిలిన పెరుగును ఇలా అద్భుతంగా వాడుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Different Ways To Use Leftover Curd
Leftover Curd Usage Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 15, 2024, 10:16 AM IST

Different Ways To Use Leftover Curd : చాలా మందికి భోజనం చివరన ఒక ముద్దయినా పెరుగుతో తింటే కానీ సంతృప్తి కలగదు. అయితే.. పెరుగు తాజాగా ఉంటే కానీ కొందరు దగ్గరికి రానివ్వరు. కానీ.. కొన్నిసార్లు కూరల్లాగే పెరుగు మిగిలిపోతుంది. అలాంటి టైమ్​లో దాన్ని మరుసటి రోజు తిందామంటే పుల్లగా అనిపిస్తుంది. దాంతో మిగిలిన పెరుగును(Curd) బయట పడేస్తుంటారు. అయితే.. ఇలా మిగిలిన పెరుగును కొన్ని వంటకాల్లో, ఇతర పనుల కోసం వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

స్మూతీలు : మిగిలిపోయిన పెరుగును అలాగే తినడానికి ఇష్టపడని వారు.. దాన్ని పండ్ల రసాలు, స్మూతీస్‌ తయారీలో వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. స్మూతీలకు కాస్త పెరుగు పులుపెక్కినా టేస్టీగానే ఉంటుంది. స్మూతీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు బ్లెండర్​లో పండ్లు, తేనె, కొన్ని ఐస్​క్యూబ్స్​తో పాటు కొద్దిగా పెరుగు వేసి.. బ్లెండ్ చేసుకోండి. ఆపై చల్లగా రుచికి రుచీ.. ఆరోగ్యం కూడా అంటున్నారు.

సలాడ్‌ : మిగిలిపోయిన పెరుగులో హెర్బ్స్‌, నిమ్మరసం, వెల్లుల్లి, ఆలివ్‌ నూనె వేసి.. సలాడ్‌లకు డ్రెస్సింగ్‌గా వాడుకోవచ్చని చెబుతున్నారు. ఆపై వాటిని తింటుంటే మధ్యమధ్యలో పుల్లపుల్లగా నోటికి తగులుతూ సూపర్ టేస్టీగా అనిపిస్తుంది.

డిప్స్‌ : మిగిలిన పెరుగుకి కాస్త పుదీనా, కొత్తిమీర, వేయించిన వెల్లుల్లి, ధనియాలు, వాము, జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూరగాయ ముక్కల సలాడ్‌, పిజ్జా, బ్రెడ్‌, చిప్స్‌ వంటి వాటికి మంచి డిప్పింగ్ సాస్​గా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.

ఐస్​క్రీమ్స్ : పండ్ల ముక్కలు, కాస్త తేనె, మిగిలిన పెరుగు.. ఈ మూడింటినీ పాప్సికల్‌ మోల్డ్స్‌లో వేసి కొన్ని గంటల పాటు డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచండి. ఆపై చూస్తే మంచి ఐస్‌క్రీమ్‌ తయారవుతుంది. ఇది రుచిగా ఉండడమే కాదు.. ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. ఇలా చేసి పిల్లలకిస్తే యమ్మీగా.. లాగించేస్తారని చెబుతున్నారు.

రాత్రిపూట పెరుగు తినొచ్చా ? ఆయుర్వేద నిపుణుల సమాధానమిదే!

కేకులు : కేక్స్, మఫిన్లు, పాన్‌కేకుల తయారీలో పాలకి బదులు పెరుగును ప్రయత్నించి చూడండి. ఎక్కువ మొత్తంలో మిగిలినప్పుడు వీటిని ప్రయత్నించొచ్చంటున్నారు నిపుణులు. పెరుగును వాడడం వల్ల బేక్ చేశాక అవి మరింత మృదువుగా వస్తాయని, రుచి పెరుగుతుందని చెబుతున్నారు.

ఇవేకాదు.. చాలా మంది మాంసాహారం వండే ముందు వాటిని మ్యారినేట్ చేసి వండుతుంటారు. ఈ క్రమంలోనే మిగిలిన పెరుగునూ కలిపితే.. మాంసం మరింత మృదువుగా మారి త్వరగా ఉడుకుతుంది. అలాగే.. కర్రీ టేస్ట్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

అదేవిధంగా.. మిగిలిపోయిన పెరుగుతో రైతా, మజ్జిగ చారు.. వంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ పెరుగుకు నీళ్లు, చక్కెర, రోజ్‌వాటర్‌.. వంటి పదార్థాల్ని యాడ్ చేసుకొని రుచికరమైన లస్సీ కూడా తయారుచేసుకోవచ్చంటున్నారు.

అలాగే.. మిగిలిన పెరుగును తినడానికి ఇష్టపడని వారు దాన్ని క్రీమీగా చిలికి చిక్కీలు, గ్రానోలా బార్స్‌పై తీగలా గార్నిష్‌ చేసి తీసుకుంటే.. తియ్యతియ్యగా, పుల్లపుల్లగా రుచి భలే ఉంటుందంటున్నారు నిపుణులు.

మీరు రోజూ పెరుగు తింటున్నారా? - శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.